పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబిపురం రాజు
మేడిపల్లి (విజయక్రాంతి): స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం నవంబర్ 29వ తేదీన చేపట్టే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శంబిపురం రాజు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో మేడ్చల్ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్, బీఆర్ఎస్ నాయకులు జక్క వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. నవంబర్ 29వ తేదీన దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించవలసిన విధివిధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు.
కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్ష దివస్ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, శాసనసభ్యులు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణ రావు, లక్ష్మరెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ లక్ష్మరెడ్డి, పీర్జాదిగూడ కార్పొరేటర్ కొల్తూరి మహేష్, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, జావీద్ ఖాన్, యూత్ అధ్యక్షులు పైళ్ల ప్రభాకర్ రెడ్డి, యాసరం శ్రీనివాస్, పింగళి జోగిరెడ్డి, శంకర్రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.