calender_icon.png 26 October, 2024 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేద్దాం

26-10-2024 02:33:27 AM

  1. ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం నుంచి సహకారం
  2. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కోటి మంది మహిళలను కోటీ శ్వరులను చేసే లక్ష్యం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారం అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా(అలీప్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ డిఫెన్స్ కాంక్లేవ్ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు.

మహిళా సాధి కారత కోసం అలీప్ చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రికి వివ రించారు. మరిన్ని ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఎంఎస్‌ఎంఈల ఏర్పా టుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అలీప్ అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో శ్లాఘనీయమని కొనియాడారు.

రక్షణ శాఖలో ఎంఎస్‌ఎంఈల ద్వారా సామర్థ్యం పెంపు, వాటా అవసరాలకు ఆర్థిక స హాయం వంటి అంశాలపై చర్చించా రు. కార్యక్రమంలో డిపార్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ సలహాదారు సుఖ్‌గీత్ కౌర్, తెలంగాణ పరిశ్రమల శాఖ డైరెక్టర్ మల్సూర్, అలీప్ సంస్థల కార్యనిర్వహణాధికారి కే రమాదేవి, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, అలీప్ సెక్రటరీ పద్మజ తదితరులు పాల్గొన్నారు.