calender_icon.png 10 January, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకుందాం

08-01-2025 12:46:39 AM

  1. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
  2. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి ఎన్నిక

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7(విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకుని.. ఐక్యతను చాటాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని బీసీ భవన్‌లో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ర్ట సభ్యులను ఎన్నుకున్నారు.

ఈ సమావేశానికి  ఎన్నికల అధికారిగా హైదరాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఆర్ కోటాజి వ్యవహరించారు. సంఘం రాష్ర్ట అధ్యక్షుడిగా ముకురాల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ డీ రమ ఎన్నికయ్యారని జాజుల ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు కోసం పోరాడుతామన్నారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేజర్లు బీసీలకు గుదిబండగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.  బీసీ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు తెచ్చే విధంగా ప్రభుత్వంతోపోరాడుతానని చెప్పారు.నూతన అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. సంఘం బలోపేతంతో పాటు బీసీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు.

నూతన ప్రధాన కార్యదర్శి డీ రమ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులపై వివక్షను తగ్గించేలా, వారికి తగిన గౌరవం దక్కేలా పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం మాజీ అధ్యక్షుడు బాలాచారి, సంఘం రాష్ర్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ర్ట అధ్యక్షులు మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.