calender_icon.png 4 February, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమించుకుందాం ఏఐ సాయంతో..

28-01-2025 12:00:00 AM

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనేది పాత పాట.. మానవ సంబంధాలన్నీ డిజిటల్ సంబంధాలు అనేది కొత్త మాట. మనిషి జీవితంలోకి ఎప్పుడైతే టెక్నాలజీ ఎంటర్ అయ్యిందో సంబంధాలు కూడా డిజిటల్‌మయంగా మారాయి. ఒకప్పుడు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకొని ప్రేమించుకోవడానికి ఇష్టపడేవారు.

ప్రస్తుతం డేటింగ్ యాప్స్‌తో ఎంత సులువుగా ప్రేమలో పడుతున్నారో.. అంతేసులభంగా విడిపోతున్నారు. వీటి అన్నింటికి చెక్ పెడుతోంది ఏఐ టెక్నాలజీ. మీరు వాడే డేటింగ్ యాప్ సురక్షితమైనదేనా? ప్రేమించే వ్యక్తి ఫ్రొఫైల్ నిజమైనదేనా? లాంటి విషయాలను వివరంగా సేకరించి మనకు తెలియజేస్తోంది. అనివార్య కారణాల వల్ల ప్రేమికులు విడిపోతే ఒంటరితనానికి చెక్ పెట్టేందుకు కూడా సాయపడుతుంది.

మాజీ ప్రియుడు లేదా ప్రియురాలితో ఎలా మాట్లాడుకుంటామో.. అలా ఏఐతో ప్రేమగా మాట్లాడుకోవచ్చు. విరహ వేదనను పొగొడుతూ గత చేదు జ్ఞాపకాలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తాయి. అయితే ఎన్ని లాభాలున్నా ఏఐని ఒక వ్యాపార వస్తువుగా భావించాలని చెబుతున్నారు నిపుణులు.