calender_icon.png 21 March, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వుతూ బతికేద్దాం!

19-03-2025 12:00:00 AM

నేడు జాతీయ నవ్వుల దినోత్సవం :

‘ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో నవ్వును అలవాటుగా మార్చుకోవాలని’ నేటి  (మార్చి 19) జాతీయ నవ్వుల దినోత్సవం మనకు గుర్తు చేస్తూ, ఆ మేరకు ప్రేరణనిస్తుంది. నవ్వుతూ జీవించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఎన్నో. మనిషికి ఒక సహజ మైన, అమూల్యమైన మానసిక విరామంగా దీనిని అభివర్ణించాలి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పదిలపరిచే శక్తివంతమైన మంత్రంగానూ పనిచేస్తుంది.

నవ్వుకుంటూ ఉండడం వల్ల హృదయం, ఊపిరితిత్తులు, కండరాలను ఉత్తేజపడడంతోపాటు రక్తప్రసరణా మెరుగవుతుంది. ఈ రకమైన అద్భుతమైన గుణం ఈ అలవాటుకు ఉంది. ఒత్తిడిని తగ్గించడంలో నవ్వు సహజ సిద్ధమైన ఔషధంగా కూడా మారుతుంది. అంతేకాక, మనసును సమతుల్యం చేసి అంతర్గత ఉల్లాసాన్ని మేల్కొల్పుతుంది. నవ్వు ఎండా ర్ఫిన్లను విడుదల చేసి మనస్సుకు హాయిని కలిగిస్తుందని నిపుణు లు అంటున్నారు.

కోర్టిసాల్ లాంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గిం చే విశేష ప్రభావాన్ని కూడా ఇది చూపిస్తుందని చెబుతున్నారు. నవ్వు సమాజంలో అనుబంధాలను బలపరిచే సజీవమైన మాధ్యమం. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి నవ్వినప్పుడు, మన మధ్యన వున్న అనుబంధం మరింత గాఢమవుతుంది. అయి తే, నవ్వు ఎవరినైనా కించపరచకుండా, అందరికీ ఆనందాన్ని పం చేలా ఉండాలి.

నవ్వు ఒకరినుంచి మరొకరికి వ్యాపించే మధురమైన లక్షణాన్ని కలిగి ఉండటం సహా మన చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచే శక్తిని అందిస్తుంది. నవ్వును ప్రతిరోజూ అలవాటుగా మార్చుకోవాలని మానసిక వైద్యులు అంటున్నారు. ఫలి తంగా మన ఆరోగ్యానికి అదనపు శక్తి అందుతుంది.

హాస్యభరితమైన సినిమా చూడడం, ఓ మంచి చమత్కారాన్ని పంచుకోవ డం లేదా గతంలో మనకు ఆనందాన్ని ఇచ్చిన సంఘటనలను గుర్తు చేసుకోవడం వంటి చిన్న చర్యలే అయినా, అవి నవ్వును ప్రేరేపిస్తాయి. ఈ ప్రత్యేకమైన రోజు ప్రతి ఒక్కరూ ‘నవ్వుతో నిండి న జీవితం గడపమనే’ సందేశాన్ని అందిస్తుంది. అందుకే, మన జీవితాన్ని మరింత ఉల్లాసభరితంగా, ప్రకాశవంతంగా, ఆరోగ్యకరంగా మార్చే గొప్ప మాయాజాలంగా నవ్వును అభివర్ణించవచ్చు.

 డా. కృష్ణకుమార్ వేపకొమ్మ