calender_icon.png 14 November, 2024 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాస్త్రీయ దృష్టిని పెంచుదాం, సమాజ ప్రగతికి తోడ్పడుదాం

13-11-2024 10:19:26 AM

నాలుక పై మంటలు లేపుతున్న నరేష్

ఎస్సై రాజు

వెల్దుర్తి : శాస్త్రీయ దృష్టిని పెంచుదాం సమాజ ప్రగతికి తోడ్పడుదామని ఎస్సై రాజు, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. జిల్లా ఎస్పీ  ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తూప్రాన్ సిఐ రంగాకృష్ణ  ఆధ్వర్యంలో వెల్దుర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్- వ్యక్తిత్వ వికాసం-  సైన్సు- మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశంపై  అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎస్సై రాజు, ఉప్పులేటి నరేష్ హాజరై మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను విద్యార్థులు వదిలిపెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలని. దొంగ స్వాములు భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. బాల్యవివాహాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలన్నారు.