calender_icon.png 10 March, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తోటి వారికి సహాయం చేద్దాం

10-03-2025 01:32:08 AM

పాలమూరు పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు యన్మన్ గండ్ల రమేష్ చారి

మహబూబ్‌నగర్, మార్చి 9 (విజయ క్రాంతి) : తమ చుట్టూ ఆపదలో ఉన్న వారికి ఆదుకునే మనసు ప్రతి ఒక్కరిలో ఉండాలని పాలమూరు పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు యన్మన్ గండ్ల రమేష్ చారి అన్నారు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1980,90,20 సంవత్సరకాలంలో స్వర్ణకార వృత్తి చేసినటువంటి క అనసూయమ్మ గారు గతం లో నాను లు,గోపితాడు లు ఎంతో నైపుణ్యము తో మన ఉమ్మడి పాలమూరు జిల్లా స్వర్ణకార వృత్తి చేసే వారికి అల్లి ఇచ్చేవారన్నారు.

కాలక్రమేనా రాజస్థాన్ వారి రాకతో పనులు పూర్తిగా ఆగిపోయాయి, పైగా వారి వయసు పై బడినం దున స్వర్ణకార వృత్తికీ దూరం కావడం జరిగిందని పేర్కొన్నారు.  వారి నివాసం కి వెళ్లి వారి ఆరోగ్యం గురించి అడిగి అలాగే ఆర్ధిక స్థితి గురించి తెలుసుకుని వారికి స్వర్ణకార సభ్యుల సహకారంతో కొంత డబ్బు సహాయం చేసి సన్మానం చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రతి ఏడాది సహాయ సహకారాలు చేసేందుకు స్వర్ణకార సంఘం ముందు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.