16-03-2025 01:01:27 AM
సహజంగా మొక్కలు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. మొక్కల్లో కొన్నింటిని మట్టిలోనే కాదు.. నీళ్లలోనూ పెరుగుతాయి. నీటిలో పెరిగే మొక్కల వివరాలు తెలుసుకుందాం.
స్పైడర్ ప్లాంట్, కోలియస్, లక్కీబాంబూ, ఫిలోడెండ్రాన్, గోల్డెన్ పాథోస్, రబ్బర్ ప్లాంట్, కెలాడియం, ఇంగ్లిష్ ఐవీతో పాటు బెగోనియా, హైసింత్, జెరానియం వంటి పూల మొక్క ల్ని నీళ్లలోనూ పెంచొ చ్చు. నీటిలో మొక్కల్ని పెంచాలనుకుంటే ముందుగా ఏ మొక్క లక్ష ణం ఏంటో తెలుసుకోవా లి. కొన్ని ప్రత్యక్షకాంతిని ఇష్టపడితే.. మరికొన్ని చీకట్లో ఉన్నా చక్కగా పెరు గుతాయి. దానికి అనుగుణంగా ఏ వాటర్ ప్లాంట్స్‌ని పెట్టొచ్చో నిర్ణయించుకోవాలి.
జాగ్రత్తలు..
ఇత్తడి, స్టీలు వంటి లోహపు పాత్రలు కాకుండా.. పారదర్శకంగా ఉండే గాజువాటిని ఎంచుకోవాలి. మట్టిలో పెరిగే మొక్కలతో పోల్చితే ఇవి కొంచెం నెమ్మదిగా ఎదుగుతాయి. కాని ఎప్పుడూ పచ్చగా ఉంటాయి.
వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్‌ని నెలరోజుకోసారి ఇస్తే చాలు.. నీళ్లల్లో పెంచే మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి.
ఆకులు రంగుమారినా, వడలినా పరోక్ష కాంతిలో ఓ వారంరోజుల పాటు నాలుగైదు గంటలైనా ఉంచండి.