calender_icon.png 4 October, 2024 | 4:56 AM

సెక్యూరిటీ లేకుండా మూసీ బాధితుల వద్దకు వెళ్దాం

04-10-2024 01:48:21 AM

ప్రభుత్వ వైఖరిని వారు సమర్థిస్తే ముక్కు నేలకు రాస్తా.. రాజకీయాల నుంచి తప్పుకుంటా

సీఎంకు ఎంపీ ఈటల రాజేందర్ సవాల్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి): దమ్ముంటే సెక్యూరిటీ లేకుం డా మూసీ బాధితుల వెళ్తామని సీఎం రేవం త్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తేదీని నిర్ణయించ మని, చైతన్యపురి లాంటి కాలనీకి ఇద్దరం కలిసి వెళ్దామన్నారు.

సీఎం తీరును ప్రజలు సమర్థిస్తే వెంటనే ముక్కు నేలకు రాసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాజేందర్ వ్యాఖ్యానించారు. గురువారం సికింద్రాబాద్‌లోని గాయత్రి గార్డెన్స్ డైమండ్ పాయిం ట్ వద్ద మీడియాతో మాట్లాడిన ఈటల సీఎంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాము తెలంగాణ కోసం పోరాడుతు న్న రోజుల్లో .. సీఎం రేవంత్ ఆంధ్రా పాలకులకు మద్దతుగా నిలిచారన్నారు.

తమ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ ఆ ముసుగులో దోపిడీలకు పాల్పడతామంటే ఊరుకోమన్నారు. రేవంత్‌రెడ్డి తన ముఖ్యమంత్రి స్థాయిని మరిచి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌లో మీటింగ్ పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడారని, చదువుకున్న సంస్కారం ఉంటే ఈ రకమైన వ్యాఖ్యలు చేసేవారు కాదన్నారు.

మల్కాజిగిరి ప్రజలు గతంలో రేవంత్‌ను ఎంపీగా గెలిపిస్తే.. నియోజకవర్గం ముఖం కూడా చూడకుండా మోసం చేశావన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం మంత్రి గానైనా పనిచేసిఉంటే కాస్తునా అవగాహన ఉండేదన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలు, 66 హామీలు, 420 పనులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

రైతుల ఓట్ల కోసం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో మీటింగులు పెట్టి అమలు కానీ హామీలతో మోసం చేశారన్నారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం తప్పా మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూర్చడం లేదన్నారు. ప్రతినెల రూ. 2500, తులం బంగారం, రూ.20 లక్షల వడ్డీ లేని రుణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

రైతులను వెంటనే రుణం తీసుకో మని చెప్పి, రుణమాఫీ పూర్తిగా చేయలేదన్నారు. కనీసం పదుల కిలోమీటర్ల పొడువు లేని మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు కేటాయించడమేంటని మండిపడ్డారు. నాలుగు నెలలుగా జీతాలు లేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వ నిజ స్వరూపం బయటపడిందన్నారు.