calender_icon.png 28 February, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెళ్లొస్తాం రాజన్నా.. మళ్లొస్తం

28-02-2025 02:14:35 AM

  • ముగిసిన మహా శివరాత్రి వేడుకలు తిరుగుపయనమైన భక్తులు
  • మూడు లక్షలకుపైగా దర్శనం 
  • తిరుగుపయనంలో రాజన్న ఆలయం వద్ద స్వామివారికి దండం పెడుతున్న భక్తులు

వేములవాడ, ఫిబ్రవరి 27: మూడురోజులపాటు వేములవాడ రాజన్న సన్నిదిలో అంగరంగ వైభవంగానిర్వహించినమహాశివరాత్రి జాతర వేడుకలు గురువారం తో ముగిశాయి. ఎల్లోస్త్రం రాజన్న.. మల్లొస్తం.. మా పిల్లాజెల్లాని సల్లంగసూడు.. అంటూ భక్తులు ఆలయ ముఖద్వారం ఎదుటరాజన్నకు దండాలు పెట్టి.. ఇంటికి తిరుగు ముఖం పట్టారు. మహా శివరాత్రి జాతర సందర్భంగా లక్షలాది మందితో కిటకిటలాడిన వేములవాడ వీధుల న్నీ భక్తుల తిరుగు పయనంతోవెలవెలబోయాయి.

డు రోజుల్లో స్వామివా రిని మూడు లక్షలకుపైగాభక్తులు దర్శించుకున్నారాని ఆలయ అధికా రులు తెలిపారు. అందరి సహకారంతోనే జాతర విజయవంతమైందని, ఇందుకు సహకరించిన అందరికీ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,ఈవో వినోద్ రెడ్డి కృత్ఞతలు చెప్పారు.- అందరి కృషితోనే సక్సెస్: అందరి సహకారం, సమన్వయంతో మహాశివరాత్రి జాత ర విజయ వంతమైందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యేఅది శ్రీనివాస్ పేర్కొన్నారు.

గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉంటూ పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా , ఎస్సీ అఖిల్ మహాజన్, అలయ ఈవో వినోద్ రెడ్డి అధికారు లకు విప్ కృతజ్ఞతలు తెలిపారు.అలాగేమూడురోజులుగా భక్తులకు అసౌకర్యం కలుగకుండాఅన్ని ఏర్పాట్లు చేశామని, ఇందుకు సహకరించిన అధికారులు, ఉద్యోగులు, మీడియా మిత్రులకు ఈవో కృతజ్ఞతలు తెలిపారు.

ప్రముఖులకు సన్మానం 

 మహాశివరాత్రి జాతర పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన వారందరికీ రాజన్న ఆలయం ఘనంగా సత్కరించింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి లను ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనాలు చేశారు.