calender_icon.png 24 January, 2025 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చుకుందాం బేబీ

22-01-2025 12:00:00 AM

స్టార్ హీరో విశ్వక్‌సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. విశ్వక్.. అమ్మాయి-గా, అబ్బాయిగా కనిపించనున్నారు.

దీంతో ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఫస్ట్ సింగిల్ సోనూ మోడల్ సాంగ్‌కూ ఆదరణ లభించింది. తాజాగా మేకర్స్ రెండో పాట గురించి అప్డేట్ ఇచ్చారు. ‘ఇచ్చుకుందాం బేబీ’ అనే పాటను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

సెకండ్ సింగిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాయకానాయికల రొమాంటిక్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి రైటర్: వాసుదేవ మూర్తి; సంగీతం: లియోన్ జేమ్స్; సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్; ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.