calender_icon.png 17 November, 2024 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలానా బాటలో నడుద్దాం!

10-11-2024 12:00:00 AM

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినమైన అక్టోబర్ 11న ‘జాతీయ విద్యా దినోత్సవం’ జరుపుకుంటున్నాం. అయన ఆశయాలైన జాతీయ సమైక్యత, లౌకిక వాదం, హిందూ ఐక్యత వంటి వాటికోసం అందరూ పునరంకితం కావాలి. దేశ స్వాతంత్య్రం కోసం సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి అనేక ఉద్యమాల్లో పాల్గొని, జైలు జీవితం గడిపిన మహోన్నత జాతీయ నాయకుడు మౌలానా.

ముఖ్యంగా హిందూ ఐక్యత కోసం తన జీవితాన్ని  ధారబోసిన లౌకిక వాది. దేశ విభజనను వ్యతిరేకించారు. ముఖ్యంగా మహమ్మద్ ఆలీ జిన్నా ప్రాతిప దించిన ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. దేశ సమైక్యతకు, లౌకిక భావనకు ప్రతీకగా నిలిచారు. చివరకు దేశ విభజనను అడ్డుకోలేక పోయానని కుమిలిపోయారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, మరణించే వరకు ఆ పదవిలో ఉన్నారు. దేశ విద్యా రంగానికి అనేక విధాల పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. 1951లో మొదటి ఐఐటీని నెలకొల్పారు. బెంగళూరులో ఐఐఎస్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్) ఏర్పరి చారు. ఎంతో ముందుచూపుతో ‘యూనియన్ గ్రాంట్ కమిషన్’ (యూజీసీ)ను నెలకొల్పారు. దేశం లో ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ (సీబీయస్‌ఈ)ని ఏర్పాటు చేశారు.

అదే విధంగా ‘ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ’కి రాజ్యాంగ పరంగా మైనారిటీ హోదా కల్పించారు. తద్వార మైనారిటీ ప్రజలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారు. అంతేకాక, రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన ‘శాంతినికేతన్ విద్యాసంస్థ’కు  ‘సెంట్రల్ యూనివర్సిటీ హోదా’ కల్పించారు. ఢిల్లీలో  ‘జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ’కి అంకురార్పణ చేసింది కూడా మౌలానాయే. 

ఈ విధంగా దేశంలో అందరికీ, అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన, సమానమైన విద్యను అందించడా నికి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం ఆజాద్ తన జీవితాన్ని అంకితం చేశారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయ పడేవారు. ఏ లక్ష్యాల కోసం మౌలానా తన జీవిత పర్యంతం కృషి సలిపారో వాటికి విరుద్ధంగా నేడు సమస్త విద్యావిధానంలో పెను మార్పులు చేస్తుండడం దురదృష్టకరం.

ఈ ‘జాతీయ విద్యా దినోత్స వం’ సందర్భంగానైనా ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యా బోధన, కళాశాలలో సౌకర్యాల కోసం అన్ని చర్యలూ తీసుకోవాలి. అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిం చే విద్యను అందుబాటులోకి తేవాలి. ఇకనైనా ‘కొఠారి కమిషన్’ సూచించినట్లు జీడీపీలో 6% నిధులు విద్యకు కేటాయించాలి. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించ డానికి తగు చర్యలు తీసుకోవాలి. జాతీయ సమైక్యత, లౌకిక వాదం, హిందూ ఐక్యత కోసం మౌలానా ఆసాంతం తపించారు. అంతటి మహనీయుని బాటలో దేశప్రజలు, రాజకీయ నాయకులు నడవాల్సి ఉంది.  

- ఐ.ప్రసాదరావు