కేసీఆర్ రద్దుఅయిన వెయ్యినోటు
- ప్రభుత్వ పాలన తీరుపై అక్కడే చర్చపెట్టుకుందాం
- సోషల్ మీడియాలో వచ్చిన లైక్‌లు చూసి సంబుర పడిపోవద్దు
- మొగిలిగిద్దలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రం
- ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవ సభకు హజరైన సీఎం రేవంత్‌రెడ్డి
రంగారెడ్డి/షాద్‌నగర్, జనవరి 31 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతీరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘బయటికి వస్తే బలంగా కొడుతానంటున్నారు.. టిక్‌టాక్‌లో పోల్ పెడితే ఆయనకు ఎక్కువ లైక్‌లు వచ్చాయంటూ నాకు తక్కు వచ్చాయంట.. ఆయన తెగ సంబరపడిపోతున్నారు.
అప్పట్లో సల్మాన్‌ఖాన్‌కు రాఖీ సావంత్ కుడా ఇలాగే పోల్ పెడితే రాఖీ సావంత్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అలా అని సల్మాన్‌ఖాన్ కంటే రాఖీ సావంత్ గొప్ప నటి అని ఎవరూ అనరు’ అని సీఎం అన్నారు. కొడితే బలంగా కొడతానంటున్న కేసీఆర్.. ముందు సరిగ్గా నిలబడు అని రేవంత్ రెడ్డి ఎద్దే వా చేశారు.
ఫామ్‌హౌస్‌లో కూర్చొని మాట్లాడటం కాదు.. చిత్తశుద్ధ్ది ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు. కేసీఆర్ రద్దు అయిన వెయ్యినోటు లాంటి వాడ ని ఆయనకు ప్రస్తుతం విలువలేదన్నారు. భారత్ జోడోలో రాహుల్‌గాంధీ బీసీ డిక్లరేషన్‌పై ప్రకటన చేశారని దానికి కట్టుబడి ఉండి రాష్ట్రంలో బీసీ గణనకు శ్రీకారం చుట్టామన్నారు.
‘బీసీ కులగణనపై 2న, అలాగే ఎస్సీవర్గీకరణపై అసెంబ్లీలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. నీకు చేతనైతే అసెంబ్లీకి రా.. అక్కడే మా పాలన తీరుపై చర్చిద్దాం రా’ అని సీఎం సవాల్ విసిరారు. శుక్రవారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యను పెంచాలి.. పేదలకు పంచాలి అనే లక్ష్యంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవతుందని అన్నారు. విద్యపై పెట్టేది పెట్టుబడిగా తాము చూడటం లేదని, భావితరాలకు అది పెట్టుబడిగా తము చూస్తున్నాం కాబట్టే బడ్జెట్లో విద్యకు 7శాతం నిధులు కేటాయిం చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వంలో విద్యను నిర్విర్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము బడ్జెట్లో రూ.21వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో పాఠశాలలు, యూనివర్సిటీల గ్రాఫ్ దిగజారిం ద న్నారు. గత పదేళ్ల పాలనలో ఉపాధ్యాయులు అరిగోస పడ్డారన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 11వేల టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పోస్టులను భర్తీ చేశామని, 31 వేల ఉపాధ్యాయు లకు పదోన్నత్తులు కల్పించామని, 35వేల ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టినట్లు ఆయన గుర్తుచేశారు. యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు అడుగులు వేసి యూనివర్సిటీలో ఖాళీ పోస్టులు భర్తీచేశామన్నారు.
మొగిలిగిద్ద పాఠశాలకు ఒక చరిత్ర ఉందని.. ఇక్కడ చదివిన వారంతా దేశ విదేశాలో స్థిరపడినట్లు చేప్పారు. తొలి ముఖ్య మంత్రి బూర్గుల రామకృష్ణరావు, మర్రి చెన్నారెడ్డి లాంటి వారిని ఈ పాఠశాల అం దించిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా.. ధనిక రాష్టాన్ని బీఆర్ఎస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని సీఎం విమర్శించారు.
రూ. 7లక్షల కోట్లు అప్పు చేసి తమకు 2023లో రాష్ట్రాన్ని అప్పగిస్తే రూ. 18వేల కోట్లు అప్పుల మిత్తీలకే సరిపోతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చి న 60 రోజులోనే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేశాం అని.. కేసీఆర్ మాత్రం రుణ మాఫీ చేయలేదంటున్నారన్నారు. అసెంబ్లీకి వస్తే అన్ని లెక్కలు తేల్చుదాం అని సవాల్ చేశారు.
కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్..
14 నెలలు ఫామ్‌హౌస్‌లో ఉండి కేసీఆర్ కథలు చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీపై కేసీఆర్ అబద్ధాలు వల్లవేస్తున్నారని.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ కి సంబంధించిన లెక్కలు అధికారికంగా బయటపెడుతామని చెప్పా రు. గుమ్మికింద పందికొక్కుల్లా మిగులు బడ్జెట్‌ను బీఆర్ఎస్ పాలనలో నేతలు తినేశారని ఎద్దేవా చేశారు.
రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళకు ఉచిత బస్సు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీకి రూ.10 లక్షలు రైతు భరోసా పథకాలు అమలుచేస్తున్నామని, మార్చి 31లోగా రైతు భరోసా నిధులు జమచేసే పూచీ తనదని రేవంత్‌రెడ్డి హామినిచ్చారు. అబద్ధాలు చేప్పడం వల్లనే కేసీఆర్‌ను ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించారు.
ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా కేసీఆర్‌కు ఇంకా బోధపడటం లేదని అన్నారు. ఏడాదిలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అభినందించడానికి కేసీఆర్‌కు మనసు రాకపోతే షామ్హౌస్లోనే పడుకోవాలని వ్యాఖ్యనించారు. ‘కేసీఆర్ పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చాం.. ఫామ్‌హౌస్‌లో ఉండి ఏం గంభీరంగా చూస్తున్నావ్..
రాష్ట్రంపై పడి నీ కొడుకు, అల్లుడు అచ్చోచ్చినా అంబోతులా పడి తిరుగుతున్నారు.. వారు యమకింకర్లుగా మారి ఎక్కడపడితే అక్కడ మేశారు. నీ కోసం ప్రజలేవరూ ఎదురుచూడటం లేదని.. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి’ అని సీఎం స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధ్దంగా ఉండాలని, అన్ని సీట్ల కాంగ్రెస్ గెలుచుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు.
మొగిలిగిద్దలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం..
మొగిలిగిద్ద ఉన్నత పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తామని, అడ్వాన్స్ టెక్నాలజీ కేం ద్రం ఏర్పాటుకు రూ.16 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు చేప్పారు. సాంకేతిక నైపుణ్యం పెంచి నిరుద్యోగాన్ని రూపుమాపేందుకే యంగ్ ఇండియా స్కిల్ యూని వర్సిటీని ప్రారంభించినట్లు గుర్తు చేశారు.
తామంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉన్నత స్థా నంలో ఉన్నామని, విద్య ప్రాముఖ్యతను గు ర్తించే తన దగ్గర విద్యశాఖ ఉంచుకొన్నట్లు చేప్పారు. ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండి భావి భారత విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆ యన కోరారు. మొగిలిగిద్ద గ్రామాన్ని, పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఏమైనా సమస్యలు ఉన్నాయా?
మొగిలిగిద్ద పాఠశాల ఉపాధ్యాయులతో సీఎం
రంగారెడ్డి, జనవరి31 (విజయక్రాంతి): మొగిలిగిద్ద పాఠశాల 150వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిసిన సీఎం రేవంత్‌రెడ్డి.. పాఠశాల ఉపాధ్యాయులతో కొద్దిసేపు ముచ్చ టించారు. పాఠశాల చరిత్ర, పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ప్రముఖుల వివరాల గురించి ఆరా తీసారు. అనంతరం ప్రస్తుత పరిస్థితి, సమస్యలు తదితర విషయాల గురించి అడిగి తెలుసుకొన్నారు.
మీ సమస్యలు ఏంటి, పాఠశాల అభివృద్ధికి ఏం కావాలి అని అడిగారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పాఠశాల బిల్డింగ్ పాతదైందని, ల్యాబ్స్ కొరత ఉందని, లైబ్రరీ ఏర్పాటు చేయాలని తదితర సమస్యలను ఏకరవు పెట్టారు. స్పందించిన సీఎం పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీచ్చారు.
అనంతరం విద్యార్థులతో సీఎం కాసేపు ముచ్చటించారు. ఇక్కడ చదివి ఉన్నత స్థానాలకు ఎదిగినవారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.