వనపర్తి (విజయక్రాంతి): ప్రపంచ విప్లవయోధుడు చేగువేరా కలగన్న ధనిక పేదలేని సమాజ ఆశయ సాధన కోసం పోరాడాలని సిపిఐ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. చేగువేరా 57వ వర్ధంతిని ఈరోజు వనపర్తి సిపిఐ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాని కార్యదర్శి గోపాలకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు యత్తం మహేష్ మాట్లాడారు.
అర్జెంటీనాలో పుట్టి డాక్టర్ విద్య చదివి సమాజానికి వైద్యం చేయాలని భావించిన మహాయోధుడు చేగువేరా అన్నారు. క్యూబా పోరాటంలో స్వాతంత్రం సాధించారన్నారు. క్యూబా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ భారతదేశంలో పర్యటించారన్నారు. ఆయన గెరిల్లా పోరాటాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయన్నారు. అర్జెంటీనాలో పుట్టిన చేగువేరా ఆయన సమన్నత ఆశయాల కోసం జరిపిన పోరాటంలో ప్రపంచ విప్లవ యోధుడుగా మారారన్నారు. సిపిఐ జిల్లా నాయకులు పి కళావతమ్మ, రమేష్, గోపాలకృష్ణ, పృథ్వినాదం, విష్ణు, చందు, జయమ్మ, శిరీష, లక్ష్మీనారాయణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.