calender_icon.png 4 April, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడీల హక్కుల కోసం పోరాటం చేద్దాం

26-03-2025 01:57:05 AM

జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు 

 మహబూబాబాద్. మార్చి 25: (విజయ కాంతి ) లంబాడీల హక్కుల కొరకు ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వట్టె వాగు సమ్మక్క సారక్క పెద్దల దగ్గర ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఎన్నిక సమావేశం రాష్ట్ర కార్యదర్శి విష్ణు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు జాతీయ ఉపాధ్యక్షులు శంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు అయిన మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు గా ఉన్నవారికి శుభాకాంక్షలు తెలిపి మన పోరాటం మన హక్కుల చట్టాలు రక్షించే విధంగా ముందుకు వెళ్లాలని మన పాలకులు మనమన్నా మన చట్టాలన్న చిన్న చూపు ధోరణితో చూస్తున్నారని అన్నారు.

మన పోరాటాలు వాళ్ళ కంటిలో నలుసు కూడా కాలేకపోతున్నాయని మన సమాజాన్ని చైతన్యం చేసి  పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. అనాదిగా లంబాడీలు ఎస్టీలు కాదని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం చేస్తున్నామని వాళ్ళని తొలగించే వరకు పోరు ఆగుద్దని పాలకుల నిర్లక్ష్యం మన సమాజం అంత అవుతుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు కాగా నూతనంగా ఎన్నికలు చేయబడ్డ మహబూబాబాద్ కమిటీలో అధ్యక్షులుగా తాటి సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా సిద్ధబోయిన భాస్కర్ ఉపాధ్యక్షులుగా నాగేష్ లు ఎన్నికయ్యారు.