calender_icon.png 16 November, 2024 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముప్పయ్యేళ్ల ‘దండోరా’ను ముగిద్దాం!

06-07-2024 12:00:00 AM

నరేష్ పాపట్ల :

రేపటి(జూలై 7)తో ‘ఎమ్మార్పీఎస్’ సామాజిక ఉద్యమ పోరాటానికి 30 ఏళ్లు నిండుతాయి. ఒక కులసంఘం తమ న్యాయమైన ‘ఏబీసీడీ’ వర్గీకరణ కోసం ఇంతటి సుదీర్ఘ పోరాటం నడిపిన చరిత్ర దక్షిణ భారతదేశంలోనే ఒక్క ఎమ్మార్పీఎస్‌కు మాత్రమే దక్కుతుంది. 

రా---జ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో పురుడు పోసుకున్న ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానం 30 ఏళ్లకు చేరుకుంది. విద్య, ఉద్యో గ, ఆర్థిక రంగాల్లో అత్యంత వెనుకబడిన మాదిగ సామాజిక వర్గం గత మూడు దశాబ్దాలుగా ఒకే అంశమైన ‘ఏ,బీ,సీ,డీ’ వర్గీకర ణ కోసం అలుపెరు గని పోరాటం నడుపుతున్నది. జూలై 7, 1994న అవిభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ‘మాదిగ రిజర్వేషన్ పోరా ట సమితి’ (ఎమ్మార్పీఎస్) మంద కృష్ణమాదిగ నేతృత్వం లో ఆవిర్భవించింది. ఎస్సీ జాబితాలోని 59 కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల వాటాను పంచాలన్న ఏకైక నినాదంతో ఈ సంస్థ చేపట్టిన సామాజిక ఉద్యమానికి స్వల్ప కాలంలోనే అనూ హ్య స్పందన లభించింది.

న్యాయబద్ధమైన డిమాండ్ కావడంతో ప్రధాన పార్టీలు సైతం తమ మద్దతును ప్రకటించాయి. విభిన్న రూపా ల్లో ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి పెరగడంతో 1999లో రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ ఆమోదముద్రతో ‘ఏ,బీ,సీ,డీ’ వర్గీకర ణ ఆకాంక్ష నెరవేరింది. ఫలితంగా 2004 నవంబర్ వరకు ఐదేండ్లలో మాదిగలు సుమారు 23 వేల ప్రభుత్వ ఉద్యోగాలు పొం దారు. అయితే, ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉమ్మడి రిజర్వేషన్లతో అత్యధిక లబ్ధి పొందిన సోదరవర్గం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, రాష్ట్ర పరిధిలో వర్గీక రణ అంశం లేదనే సాంకేతిక కారణంతో సుప్రీంకోర్టు అమలవుతున్న వర్గీకర ణకు బ్రేక్ వేసింది.

అప్పటి నుండి మాదిగ, ఉపకులాలు తమ న్యాయమైన వాటాకోసం అవిశ్రాంత పోరా టం సాగిస్తున్నాయి. 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలవేళ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ‘అణగారిన వర్గాల విశ్వరూప’ మహాసభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో మాదిగలు తమ చిరకాల కోరిక నెరవేరబోతుంద ని ఆశగా ఎదురు చూస్తున్నారు. 

అమలుతో తీవ్ర నష్టం

ఎస్సీల్లో ఉమ్మడి రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో మాదిగలతోపాటు ఉప కులాలకు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతున్నది. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రం గాల్లో పూర్తిగా వెనుకబడ్డారు. దీనిని గమనించిన ఎమ్మార్పీఎస్ అన్యాయంపై గొంతె త్తింది. బీసీల మాదిరిగానే ఎస్సీలను ‘ఏ,బీ, సీ,డీ’ గ్రూప్‌లుగా వర్గీకరించాలని పల్లెనుండి పట్నం దాకా చాపకింద నీరులా ఉద్యమాన్ని విస్తరింపజేసేంది. దీంతో 1997 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసింది.

సదరు కమిష న్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎస్సీలను నాలుగు గ్రూపులుగా (ఎ - గ్రూప్‌లో రెల్లి -మొత్తం 12 అనుబంధ కులాలకు 1 శాతం, బి గ్రూప్‌లో మాదిగ 18 అనుబంధ కులాలకు 7 శాతం, సీ గ్రూప్‌లో మాల -25 అనుబంధ కులాలకు 6 శాతం, డీ గ్రూప్‌లో ఆది ఆంధ్రులు -4 అనుబంధ కులాలకు 1 శాతం రిజర్వేషన్లు) విభజించి, 15 శాతం రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం వర్తింపజేసింది. కొంతకాలం వర్గీకరణ అమలు జరిగినా, పలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో హైకోర్టు వర్గీకరణను రద్దు చేసింది. అనంతరం ఎమ్మార్పీఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఈ సమయంలో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యే క చొరవ చూపడంతో 1999లో తిరిగి ఎస్సీ వర్గీకరణ అమలైంది.

2004 నవంబర్ వర కు కొనసాగడంతో మాదిగ, ఉపకులాలు న్యాయబద్ధంగా ప్రయోజనం పొందాయి. తర్వాత రాష్ట్ర పరిధిలో వర్గీకరణ అంశం లేదనే సాంకేతిక కారణంతో సుప్రీంకోర్టు వర్గీకరణను రద్దు చేసింది. 2007లో యూ పీఏ కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఉషామెహ్రా కమిషన్‌ను నియమించింది. ఎస్సీల్లోని దిగువశ్రేణి కులాలకుసైతం రాజ్యాంగ ఫలాలు దక్కడం న్యాయబద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరించి వర్గీకరణ చేయొచ్చునని కమిషన్ తన నివేదికను 2008లో కేంద్రానికి సమర్పించింది. కానీ, న్యాయబద్ధమైన డిమాండ్‌ను గౌరవించకుండా ఆనాడు యూపీఏ కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ విషయంలో సవతి తల్లి ప్రేమను కనబర్చింది. ప్రస్తుతం ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనం వద్ద వర్గీకరణ కేసు పెండింగ్‌లో ఉంది. 

ఉద్యమాలకు దిక్సూచిగా!

తెలుగు సమాజంలో అట్టడుగు వర్గం నుండి పేరు చివరన కులసూచికను చేర్చుకొని ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసిన ఎమ్మార్పీఎస్ కొత్త సంప్రదాయానికి బాట లు వేసింది. గత మూడు దశాబ్దాలుగా మం ద కృష్ణమాదిగ.. అణచివేతకు నిరసనగా తన గుండెపై నల్ల కండువాను మోస్తూ నే ఉన్నారు. ‘మేమెంతో మాకంత’ నినాదంతో ముందుకు సాగిన ఎమ్మార్పీఎస్.. వినూత్న నిరసన కార్యక్రమాలతో దక్షణాది రాష్ట్రాల్లోనూ విస్తరించింది. వర్గీకరణ ఉద్యమం తోపాటు సమాజంలోని బాధిత వర్గాలకు నిరంతరం అండగా నిలబడింది. ఈ క్రమం లో ఎమ్మార్పీఎస్‌ను స్ఫూర్తిగా తీసుకొని డోలుదెబ్బ, చాకిరేవు దెబ్బ, తుడుం దెబ్బ, లంబాడ హక్కుల సమితి వంటి పలు హక్కు ల సంఘాలు పుట్టుకొచ్చాయి.

గుండె సం బంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల పక్షాన ఎమ్మార్పీఎస్ పోరాడింది. ఈ పోరాట ఫలితంగానే తమ ప్రభు త్వం ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి రూపకల్పన చేసిందని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం గమనార్హం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ ఎమ్మార్పీఎస్ కీలక భూ మిక పోషిం చింది. వృద్ధులు, వికలాంగులు, వితంతు పింఛన్ల పెంపుకోసం కృషి చేసింది. ఈ విషయాన్ని ఇటీవల జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛ న్ల పంపిణీ కార్యక్రమంలో గుర్తు చేశారు. 

బీజేపీ హామీని నిలబెట్టుకోవాలి 

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని బహిరంగంగా మాదిగలకు హామీ ఇచ్చారు. దీంతో కృతజ్ఞతగా ఎమ్మార్పీఎస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచింది. తెలంగాణలోని దళితుల్లో మాదిగల జనాభా సంఖ్య సింహభా గంగా ఉంది. 2014, 2018 ఎన్నికల్లో అత్యంత బలహీనంగా ఉన్న బీజేపీ.. ఎమ్మార్పీఎస్ ఉద్యమం మద్దతుతో 2023లో ఏకంగా 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడంతోపాటు 6.98 శాతం నుండి 13.90 శాతం వరకు తమ ఓటు బ్యాంక్ ను పెంచుకుంది. ఇక, పార్లమెంటు ఎన్నికల్లోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 8 సీట్లను గెలుచుకుంది.

7 స్థానాల్లో రెండవ స్థానానికి ఎగబాకింది. అనూహ్యంగా బీజేపీ 35.08 శాతం ఓట్లు సాధించి.. రాజ్యాధికారం విషయంలో ఒక స్పష్టమైన, సాను కూల నిర్ణయానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నూ మెరుగైన ఫలితాలు రాబట్టింది. అటు కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఇటు వర్గీకరణకు ఆదినుంచి అనుకూలంగా ఉన్న నారా చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీఏ ప్రభు త్వ ఏర్పాటులోనూ ఆయన పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఇక పలు సంక్లి ష్ట వివాదాస్పద అంశాలకు అత్యంత చాకచక్యంగా పరిష్కార మార్గం చూపిన చరిత్ర మోదీకి ఉంది.

ఇచ్చిన మాట కట్టుబడి మాదిగలు ఎన్నికల్లో బీజేపీకి సహకారం అందించి తమ విశ్వాసం చాటుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై నెలకొన్న న్యాయపరమైన చిక్కులను అధిగమింపజేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలి. గతంలో నే జస్టిస్ రామచంద్రరాజు, ఉషా మెహ్రా కమిషన్లు ఎస్సీ వర్గీకరణ న్యాయబద్దమని తేల్చి చెప్పాయి. ఇంకా కమిటీల పేరు తో కాలయాపన చేయకుండా కేంద్ర ప్రభు త్వం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించేందుకు సత్వర ప్రణాళికలు రూపొందించి, శాశ్వత పరిష్కారం చూపాలి. ఎస్సీ వర్గీకరణ మాదిగల గుండె చప్పుడు. 30 ఏండ్ల కన్నీటి గోసకు కేంద్రం ఇకనైనా ముగింపు పలకాలి. 

వ్యాసకర్త సెల్ : 9505475431