calender_icon.png 9 February, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నాక్స్ తిందాం.. బరువు తగ్గుదాం

09-02-2025 12:20:39 AM

బరువు తగ్గాలని చాలామందికి ఉంటుంది. కానీ అదే సమయంలో ఆహరంపై నియంత్రణ కూడా ఉండాలి. ఒకవైపు డైట్‌లో ఉంటూనే.. మరోవైపు స్నాక్స్ తింటూ బరువు తగ్గొచ్చు. అవేంటో తెలుసా.. 

కార్న్: కార్న్ కూడా మంచి స్నాక్ ఐటెమ్. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉడకబెట్టిన మొక్కజొన్నని స్నాక్ బ్రేక్‌టైమ్, ఈవెనింగ్ స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

శనగల సలాడ్: చాట్ అంటే ఇష్టపడని వారెవరు ఉంటారు. షుగర్ ఉన్నవారు తెల్ల శనగల బదులు నల్ల శనగల్ని ఉడికించి అందులో ఉల్లిపాయ తరుగు, టమోటా తరుగు, క్యారెట్, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి తినాలి. ఇందులో పీచుపదార్థం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

ఫ్రూట్ సలాడ్: అన్నీ సీజన్లలో పండ్లు ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా ఎండాకాలంలో పండ్లని స్నాక్స్లా కూడా తినొచ్చు. పండ్లలో ఫైబర్, ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అవి జీర్ణక్రియకి హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో నీరు ఎక్కువగా ఉండే పండ్లని తింటే బాడీ హైడ్రేట్ అవుతుంది. బరువు కూడా తగ్గుతారు.

ఓట్స్: ఓట్స్ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతుంది. అలాగే ఓట్స్‌లో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ అధిక మూలంగా ఉంటుంది. కాబట్టి ఆకలిని తీర్చి కడుపును నిండుగా ఉంచుతుంది.