02-04-2025 01:12:52 AM
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
మహబూబ్‌నగర్ ఏప్రిల్ 1 (విజయ క్రాంతి) : అందరం ఒకే రకమైన సన్న బియ్యం తిందామనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం పేదలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందజేయడం జరుగుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మండల కేంద్రంలోని తాటికొండ గ్రామంలో, భూత్పూర్ మున్సిపాలిటీలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం గతంలో పండుగరోజు మాత్రమే సన్న బియ్యం తినే రోజులు ఉండేవని ఎప్పుడు ప్రతిరోజు సన్న బియ్యం తినే రోజులు మన ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను క్రమం తప్పకుండా కట్టుకుంటూ ప్రజా ప్రభుత్వము ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుందని తెలిపారు.
రాజాపూర్ మండల పరిధిలోని రాయపల్లి గ్రామంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.