calender_icon.png 3 February, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇష్టంగా తాగేద్దాం!

31-01-2025 12:00:00 AM

‘మీరు 60 ఏళ్లకు సాధించింది.. మేం 30 ఏళ్లకే సాధించాం’.. అని ఒక రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ ట్రెండ్ అవుతున్నది. ఏంటది అనుకుంటున్నారా? అదేనండి.. నడుం నొప్పి, తల నొప్పి, కాళ్ల నొప్పి.. ఈ రీల్ చూస్తే ఇవన్నీ నిజమే కదా! అనిపిస్తుంది. అయితే మారుతున్న జీవనశైలికి తగినట్టుగా జీవించడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. సమయం లేదు.. టైట్ షెడ్యుల్ అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పోషకాలు పుష్కలంగా ఉన్న.. కింది జ్యూస్‌లను హాయిగా ఆస్వాదించండి!  

కివీ

కివీ జ్యూస్‌లో విటమిన్ సీ, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కివీ జ్యూస్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. 

యాపిల్ జ్యూస్

యాపిల్ జ్యూస్‌లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో గుండె, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం బాగుటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

దానిమ్మ

దానిమ్మ జ్యూస్‌లో విటమిన్ సీ, ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తక్కువ కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పీచు, మిటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. 

నారింజ

నారింజ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సీ ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తహీనత సమస్యలను దూరం చేస్తాయి. నారింజ పండ్లను రెగ్యులర్‌గా తింటే బీపీ కంట్రోల్ అవుతుంది. గుండె సమస్యలు దరిచేరవు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో నారింజ బాగా పనిచేస్తుంది. 

ద్రాక్ష

ద్రాక్ష రసంలో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యవంతంగా మార్చుతాయి. ద్రాక్ష రసం ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాలేయ సమస్యలను దూరం చేస్తుంది.