calender_icon.png 18 January, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోలిపూర్‌ను అభివృద్ధి చేసుకుందాం

18-01-2025 02:04:04 AM

  1. ఎమ్మెల్యే మేఘారెడ్డి
  2. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు

వనపర్తి, జనవరి 17 ( విజయక్రాంతి ) : ఖిల్లా ఘణపురం మండలంలో మేజర్ గ్రామపంచాయతీ అయిన సోళీపురం గ్రామాన్ని మండల కేంద్రంగా పూర్తిస్థాయి లో అభివద్ధి చేసుకుందామని  ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  పేర్కొన్నారు.  శుక్రవారం సోలిపురంలో  ఉన్నత పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, తెలుగువాడలో  ఐదు లక్షల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే  శంకుస్థాపనలు చేశారు.

ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా వ్యవ స్థను పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం  పూర్తిస్థాయిలో దష్టి సారించిందని, సి ఎం రేవంత్ రెడ్డి సైతం విద్యా వ్యవస్థను పటిష్ట పరిచేందుకు రాష్ర్టవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వనపర్తి నియోజకవర్గంలోను విద్యా వ్యవ స్థను పూర్తిస్థాయిలో బలుపేతం చేసేందుకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, వనపర్తి శాసనసభ్యులుగా నేను  తమ కు కేటాయించిన నిధులను కేవలం విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకే కేటాయించేం దుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 

క్రీడల బలోపేతానికి  రాష్ర్టవ్యాప్తంగా నాలుగు క్రీడ పాఠశాలను ప్రారంభిస్తున్నారని అందులో ఒకటి వనపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకు న్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి నియో జకవర్గంలో సోలిపురంతో పాటు పెద్దమం దడి మండలంలోని వెల్టూర్ జంగమయ్య పల్లి బలిజపల్లి గ్రామాలను మండల కేంద్రా లుగా చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 

సోలిపురంలో సింగిల్ విండో, ఏర్పాటు తోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందామని వివరించారు.

కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు 

ఖిల్లా ఘణపురం మండలం మల్కాపురం గ్రామానికి చేరుకున్న  కష్ణమ్మ జలాలకు శుక్రవారం  ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగునీటి సమస్య తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారమని గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు నాయకులకు అధికారులకు విన్నవించుకున్న గ్రామానికి అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో  కష్ణ నీటిని గ్రామానికి మళ్ళించారని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

గతంలో నీరొచ్చిన పొలాలపై పడి రైతు పొలాలకు అందేది కాదని నేడు డి 8 కాలువ నుంచి నేరుగా గ్రామానికి  నీరం దనంపై గ్రామస్తులు హర్షణ వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో   సింగిల్ విండో అధ్యక్షు లు మురళీధర్ రెడ్డి,  మాజీ జెడ్పిటిసి సభ్యు లు  సోలిపురం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ పీ వెంకటయ్య, వెంకట్రావు,  నాయకులు సాయిచరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సతీష్, ప్రకాష్, కొండారెడ్డి,  మండల నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.