దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి) : రైతులకు మరింత నాణ్యత మైన విద్యుత్ను అందుబాటులోకి తీసుకువచ్చేం దుకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పా టు చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
మూసాపేట్ మండలం జానంపేట గ్రామంలోని సబ్ స్టేషన్ వద్ద (భూత్పూర్, అడ్డాకుల్, మూసా పేట్) మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం 30 ట్రా న్స్ఫార్మర్ల ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధు సూదన్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, రైతు లకు కరెంటు కష్టాలను తీర్చేందుకు CMD గారితో చర్చించి, ఒకే విడతలో 100 ట్రా న్స్ఫార్మర్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.
నియోజకవర్గంలోని జడ్చర్ల సబ్ డివిజన్ పరిధిలో పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో 3 కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం పాలనలో ఐదు కొత్త సబ్ స్టేషన్లు (అమిస్తాపూర్, పోల్కంపల్లి, గుడిబండ, తాటికొండ, ముత్యాలమ్మ పల్లి) ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాక త్వరలో మూసాపేట్ మండలంలో 30 కోట్ల నిధులతో 132/11 కెవి సబ్‌స్టేషన్ ప్రారంభిం చబోతున్నామని తెలియజేశారు.
భూత్పూర్, అడ్డాకుల్, మూసాపేట్ మండలాలతో కలిపి సబ్ డివిజన్ ఏర్పాటు చెయ్యాలని, ట్రాన్స్ఫా ర్మర్ రిపేరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే విద్యుత్ శాఖకు ప్రతిపా దనలు పంపడం జరిగిందని తెలియజేశారు. ఏపీస్విలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.