23-04-2025 01:41:54 AM
*- ఆశ వర్కర్లు, అంగన్వాడీలు సమన్వయంతో పనిచేయాలి
- *డిప్యూటీ డి యం హెచ్ ఓ. డా. శ్రీనివాస్
గజ్వేల్,ఏప్రిల్ 22: మహిళల, పిల్లల పోషకాహార లోపాన్ని సరి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పోషక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. పోషణ పాక్వాడ 2025లో భాగంగా మంగళవారం గజ్వేల్ ప్రాజెక్ట్ స్థాయి కార్యక్రమాన్ని గజ్వేల్ ఐఓసీ లో నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ డి యం హెచ్ ఓ. డా. శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం పోషణ పాక్వాడలో మొదటి వెయ్యి రోజులు గర్భిణీలు, పిల్లలకు పోషకాహారాన్ని అందించడంతో పాటు వారి పోషకాహార లోకంలోని మార్పుల నమోదు , ఎస్ ఎస్ ఎఫ్ పి పిల్లల పర్యవేక్షణ, పిల్లలలో ఉబకాయత్వం గురించి అందరూ అవగాహన కలిగివుండాలన్నారు.
అలాగే లబ్ధిదారులు అంగన్వాడీ ద్వారా అందించే పౌష్టికాహారం తీసుకోవాలని, ఆశలు, అంగన్వాడీ టీచర్లు కలిసికట్టుగా పని రాష్ట్రం లో పోషణ లోపం లేకుండా చూడాలని సూచించారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ సరిత మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఒక్కరో జు సంపూర్ణ భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి లబ్ధిదారులు సెంటర్ కి వచ్చి భోజనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్, వైద్యాధికారులు బల్బీర్ సింగ్ , ప్రణయ్, సత్య ప్రకాష్, పోషణ అభి యాన్ బ్లాక్ కోఆర్డినేటర్ కిరణ్, సూపర్వైజర్లు భవానీ, శ్రీలక్ష్మి, రజిత , అనురాధా ,దెబోర రాణి , రాణి, సునీత ,అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.