calender_icon.png 18 April, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగిద్దాం

03-04-2025 01:06:26 AM

  • సిద్దిపేటలో ప్రభుత్వపరంగా కార్యక్రమాన్ని చేపట్టకపోవడం విచారకరం 

మున్సిపల్ ఛైర్మన్ కడవేర్గు మంజులరాజనర్సు 

సిద్దిపేట, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): సిద్దిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతిని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లె బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ పాపన్న గౌడ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని అందంగా అలంకరించి విగ్రహం వద్దా కార్యక్రమాన్ని చేపడితే ఇప్పటి ప్రభుత్వం పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని కేవలం కార్యాలయానికే పరిమితం చేశారని విమర్శించారు. అసోసియేషన్ అధ్యక్షులు పల్లె బాలకిషన్ గౌడ్ మాట్లాడుతూ బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నగోని వినోద్, వడ్లకొండ సాయి, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్,  గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లాల్, నేతలు మార్క శ్రీనివాస్, పల్లె సునీల్, గాదగోని సత్యం, పల్లె చంద్రశేఖర్, అన్నగోని నారాయణ, గుండు శ్రీను తదితరులు పాల్గొన్నారు.