calender_icon.png 23 December, 2024 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని జయిద్దాం!

06-09-2024 12:00:00 AM

హైటెక్ యుగంలో జీవితం పరుగులమయమై పోయింది. అందరూ ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో ఒడుదొడుకు లు ఎదురుకొంటున్నారు. మారుతున్న కాలానికి అ నుగుణంగా అన్ని విషయాలలో వేగం పెరిగింది. పోటీతత్వం తీవ్రమైంది. భౌతిక సంపదపై మోజు పరిధులు దాటుతున్నది. వాణిజ్య వాదం రాజ్యమేలుతున్నది. భౌతిక సంపదపట్ల కాంక్ష అంతకంతకూ పెరుగుతూ మనుషులు ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. ఆందోళన మనిషి పాలిటి శాపంగా పరిణ మించింది. 70 శాతం ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిడి వల్లే వస్తున్నాయని పలు ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగు లు పెడుతున్నారు.

నేటి కాలంలో ఒత్తిడి అన్ని వయసుల వారికి సర్వసాధారణమై పోయింది. ఇలాంటి వారికి భవిష్యత్తులో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నా రు. ఒత్తిళ్లను ప్రారంభంలోనే అదుపు చేయకపోతే ముదిరి డిప్రెషన్‌కు దారి తీస్తుంది. దీనివల్ల తలనొప్పి, ఆందోళన, అలసట, చిరాకు, బిపి, మధుమే హం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఆరోగ్యకరమైన అలవాట్లు

జీవితంలోలక్ష్యాన్ని చేరుకోవాలంటే కాలంతోపా టు పరిగెత్తాల్సిందే. ప్రతిభ సామర్థ్యాలను పెంచుకోవడానికి తప్పక పోటీ పడాల్సిందే. ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని అదుపులో ఉంచుకోకపోతే అనారోగ్యం చుట్టుముట్టే ప్రమాదం వుంది. దీనిని తట్టుకోవడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నిద్ర మని షి జీవితంలో తప్పక ఉండాలి. కనీసం మనిషి రోజు కు 7 గంటలు తప్పనిసరి. నియమ బద్ధమైన నిద్రతోసహా మంచి ఆహార అలవాట్లు ఉండాలి. చిరునవ్వు ప్రతి వ్యక్తి భూషణం అయితే దూషణలు దూరమై ఆనందం దరిచేరుతుంది. ఆహ్ల్లాదకరమైన వాతావరణంతో ఆరోగ్యంగా ఉండగలరు. వ్యాయామం తప్పక చేయాలి.

కనీసం రోజుకు 30 నిమిషాలపాటు ఉదయం నడక, వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటివాటి వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాయామంతో మనసు నిలకడగా ఉంటుంది. నెగెటివ్ ఆలోచనలు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి2, బి12 విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. మాంసకృత్తులు, క్యాల్షియం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. పాలలోని ‘లాక్టియం’ మెదడుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. కాఫీ, టీలు తగ్గించాలి. పాలలో లేదా నిమ్మరసంలో తేనెను కలుపుకొని తాగితే ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఏదైనా ఒక పని చేసేముందు ఎలా చెయ్యాలన్నది ప్లాన్ వేసుకోవాలి. ఎప్పుడు చేయాలి? ఎంత సమయం కేటాయించాలి? వంటి విషయాల మీద ప్రణాళిక వేసుకోండి. మీరు పని చేసే చోట ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. ప్రణాళిక ప్రకారం వెళితే సమస్యల పరిష్కారాలకు అవకాశాలు ఎక్కువగా వుంటాయి. తీసుకునే ఆహారమూ ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. 

పాజిటివ్ దృక్పథం

ఒత్తిడి తగ్గాలంటే ప్రతి వ్యక్తి పాజిటివ్ దృక్పథం, ఉత్తమ ఆలోచనా విధానం, సమాజసేవ, సమర్పణ భావనలను కలిగి ఉండాలి. సమస్యలను భూతద్దంలో చూసే ధోరణి విడనాడాలి. వాటిని అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. రోజువారీ భావోద్వేగాలను ఒక పుస్తకంలో రాసి విశ్లేషించుకోండి. ఇది ఒత్తిడి నుండి ఉపశమనం ఇస్తుంది. దురాలోచన కలిగిన వారికి దూరంగా వుండాలి. ఒంటరితనాన్ని దరిచేరనీయద్దు.  పెంపుడు జంతువులు, పూల తోటల పెంపకం, ఉద్యానవనాల నిర్వహణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నడం వల్ల ఒత్తిడిని జయించవచ్చు.

వర్తమానంలో జీవించండి. ఎప్పుడు? ఎక్కడ? లేక రేపు? అనే వాటికి బదులు ఇప్పుడు, ఇక్కడ లేక  ఈరోజు అన్నట్టుగా ఆలోచించండి. సంతృప్తిని మించిన సంతోషం లేదు. మెరుగైన సంసారిక జీవనశైలి, దృఢమైన సామాజిక, సాంస్కృతిక సంబంధాలు మనోప్రశాంతకు దోహదపడుతాయి.  ఉత్తమ గ్రంథాల పఠనం మార్గదర్శిగా ఉంటుంది. ఉన్నత పాఠశాల స్థాయినుంచే  విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ ఇంప్రూవ్‌మెంట్, జనరల్ బిహేవియర్ వంటి అంశాలపై కౌన్సెలింగ్ అందేలా చూడాలి.

కళాశాల స్థాయిలో మానవీయ విలువలు ఆత్మ స్థైర్యం పెంపొందించే పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలి. ప్రతి విద్యా సంస్థలో కౌన్సెలింగ్ కేంద్రాలు మనోవికాస నిపుణులను నియమించి విద్యార్థులకు ఒత్తిడిని జయించే మార్గాలపట్ల అవగాహన కలిగించాలి. మద్యానికి దూరంగా ఉండాలి. సమాజ సేవ, ధార్మిక చింతన, ఆధ్యాత్మిక  కార్యక్రమాలలో భాగస్వాములు కావాలి. ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ, ఉత్తమ జీవన శైలి, ధైర్యం, మెరుగైన సామాజిక సంబంధాలతో ‘ఒత్తిడి’ లేని జీవితాన్ని గడిపే అవకాశాలు ఉంటాయి.