calender_icon.png 27 January, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కోసం కలిసి రావాలి

25-01-2025 12:56:30 AM

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల, జనవరి 24 (విజయక్రాంతి): ఎన్నికల వరకే రాజకీయాలు, జెండాలు, పార్టీలని, ఆ తర్వాత అధికారపక్షం, ప్రతిపక్షం తేడా లేకుండా అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పురపాలక సంఘ కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా కౌన్సిలర్ల ఆత్మీయ సన్మాన కార్యక్ర మంలో ఎమ్మెల్యే సంజయ్’కుమార్ పాల్గొని వారిని సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పదవీకాల సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. డబల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల, రైతు బజార్, పార్కులు, స్మశాన వాటికలు, డివైడర్లు, రహదారులు, సెంట్రల్ లైట్, మిని ట్యాంక్ బండ్, జోన్ల మార్పు,1000 మీటర్లలలో యావర్ రోడ్డు విస్తరణ, డంపింగ్ యార్డు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగాలంటే అధికార ప్రతిపక్ష తేడా లేకుండా అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్’ను కలిసి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. కౌన్సిల్ పదవీ కాలం ముగిసిన తరువాత ప్రజా ప్రతినిధుల కన్నా అధికారుల పాత్ర, వార్డు ఆఫీసర్ పాత్ర చాలా కీలకమన్నారు.

ప్రజా ప్రతినిధుల పదవి కాలం ముగిసినా ప్రజా సేవ నిరంతరం కొనసాగాలన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులు, అధికారులు పని చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి, ఛైర్మెన్ అడువాల జ్యోతిలక్ష్మణ్, వైస్‌చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.