calender_icon.png 16 April, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దువ్వెనను శుభ్రం చేద్దాం!

13-04-2025 12:00:00 AM

అందాన్నిపెంచే కురుల విషయంలో అమ్మాయిలు పలు జాగ్రత్తలు వహిస్తారు. కాని దువ్వెన విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారు. దువ్వెనను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోకపోతే అందులో ఉండే మురికి వల్ల జుట్టు దెబ్బతింటుంది. కాబట్టి దువ్వెన శుభ్రత విషయంలో కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరి. మరి అవేంటో తెలుసుకుందాం.. 

* వేడి నీటిలో చెంచా బేకింగ్ సోడా వేసి, హెయిర్ బ్రష్‌ని అందులో వేయాలి. ఒక పది నిమిషాల తర్వాత టూత్ బ్రష్‌తో దువ్వెన ముళ్లన్నింటిని శుభ్రం చేస్తే మురికి అంతా పోతుంది. 

* గోరువెచ్చని నీరు ఉన్న టబ్‌లో షాంపూ, లిక్విడ్ సోప్ వేయాలి. ఇందులో 15 నిమిషాల పాటు హెయిర్ బ్రష్‌ను ఉంచి తర్వాత దువ్వెన కుదుళ్లను శుభ్రం చేస్తే.. వాటికున్న వెంట్రుకలన్నీ తొలగిపోతాయి.