16-02-2025 12:00:00 AM
మొటిమలంటే ముఖం పైనే వస్తాయనుకుంటారు చాలామంది. కానీ కొంతమందికి వీపు పైనా మొటిమలు, పొక్కులు రావడం చూస్తుంటాం. వ్యాయామం కారణంగా వచ్చే చెమట, జిడ్డుచర్మతత్వం కూడా ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. ఈ సమస్య నుంచి బయటపడాంలే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో చూద్దాం..
బయటి నుంచి ఇంటికొచ్చిన తర్వాత, అలాగే వ్యాయామం పూర్తయిన వెంటనే శుభ్రంగా స్నానం చేయడం ముఖ్యం. తద్వారా శరీరంపై వచ్చిన చెమట తొలగిపోయి పొక్కులు ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు.
ఎవరి వీపు వారికి అందదు. దాంతో పైపైన శుభ్రం చేసుకుంటుంటారు. ఫలితంగా అక్కడ చేరిన మురికి, జిడ్డుదనం తొలగిపోక మొటిమలు, పొక్కుల సమస్య తలెత్తుతుంది. కాబట్టి తరచూ వీపును స్క్రబ్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన స్క్రబ్స్‌ని ఉపయోగించవచ్చు. లేదంటే బయట దొరికే స్క్రబ్‌లను ఎంచుకోవచ్చు. అయితే చర్మతత్వాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.
ట్రీట్రీ ఆయిల్ వివిధ రకాల చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఈ నూనెతో తరచూ వీపును మర్దన చేసుకోవడం మంచిది. అలాగే టీట్రీ ఆయిల్ వాడి తయారుచేసిన లోషన్లు, క్లెన్సర్లు, క్రీమ్స్ ఉపయోగించినా ఫలితం ఉంటుంది.
సన్‌స్క్రీన్ వీపుకీ అవసరమే. ఎందుకంటే దుమ్ము, కాలుష్యం కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఫలితంగా అక్కడి చర్మ కణాలు శుభ్రపడి మొటిమల సమస్య దూరం అవుతుంది. అయితే నూనె రహిత సన్‌స్క్రీన్ లోషన్లు ఎంచుకోవాలి.
వీపుపై మొటిమల సమస్యకు చెక్ పెట్టడానికి గ్లుసైమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు కూడా కారణమవుతుంటాయి. కాబట్టి జీఐ తక్కువగా ఉండే కాయగూరలు, పండ్లు, తృణధాన్యాలు.. వంటివి ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది.