ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 7 ( విజయక్రాంతి ) : ఈనెల 15న గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలల్ జయంతి వేడుకలను వనపర్తి జిల్లాలో ఘనంగా నిర్వహించుకుందాని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అధ్యక్షతన సంత్ శ్రీ సేవాలాల్ 286వ జయంతి వేడుకల నిర్వహణ పై గిరిజన నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ జయంతి వేడుకలను పార్టీలకతీతంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేయాలని సూచించారు.
ఇందులో గిరిజన సంఘాల నాయకులు, ఉద్యోగులు బాధ్యతలు తీసుకొని గిరిజన సాంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో సేవాలాల్ మహారాజ్ కు పూజలు నిర్వహించేవిధంగా చూడాలన్నారు.
అధికారులు, గిరిజన సంఘం నాయకులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని సూచించారు.ప్రత్యేక అధికారి జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బా రెడ్డి, గిరిజన సంఘం నాయకులు శంకర్ నాయక్, చంద్రు నాయక్, వాల్య నాయక్, గోవింద్ నాయక్, రాధ కృష్ణ, ఆంజనేయులు, అర్జున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు