calender_icon.png 31 January, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించుకుందాం: ఎమ్మెల్యే

29-01-2025 12:37:59 AM

మహబూబ్‌నగర్, జనవరి 2౮(విజయక్రాంతి): పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్నెంకొండ బ్మ్రెత్సవాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు జరగనున్న బ్మ్రెత్సవాలకు సంబంధించి కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీన స్వామివారి రథోత్సవ వేడుకలు ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మన్నెంకొండ బ్మ్రెత్సవ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.  బ్మ్రెత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అదనపు కలెక్టర్  శివేంద్ర ప్రతాప్ , జిల్లా ఎస్పీడి జానకి,   ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,  మన్యం కొండ దేవస్థానం ధర్మకర్త అలహరి మధుసూదన్, ఇఓ శ్రీనివాస్ రాజు,  డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, బెజ్జుగం రాఘవేంధర్, సాదతుల్లా, శ్రీనివాస్ యాదవ్, ఆజ్మత్ ఆలి, జిల్లా అధికారులు,  మన్యం కొండ దేవస్థానం పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.