calender_icon.png 25 April, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్భుతంగా ఇండ్లు నిర్మిద్దాం

24-04-2025 12:08:27 AM

మహమ్మదాబాద్ ఏప్రిల్ 23 : ఇందిరమ్మ ఇండ్ల ను అద్భుతంగా నిర్మిద్దామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ అన్నారు. బుధవారం చిన్నయపల్లి గ్రామపంచాయతీలో 26 చెంచు కుటుంబాలకు సంబంధించి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులకు తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇండ్లకు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజేషన్ సెక్రెటరీ రాము లు, డిసిసి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శాంతిరంగ్యా, పవన్ కుమార్. రహీం, ఇసాబస్రవి,  మాజీ సర్పంచ్ రామ్ లాల్,  గోపాల్, హౌసింగ్ డిఈ పుష్పలత, పంచాయతీ సెక్రెటరీ ఆంజనేయులు, లబ్ధిదారులు ఉన్నారు.