29-03-2025 12:07:07 AM
ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ భద్ర
ముషీరాబాద్: మార్చి 28: (విజయక్రాంతి) : కాలుష్య రహిత సమాజాన్ని తీర్చి దిద్దేందుకు కృషి చేయాలని, తెలంగాణ గడ్డమీద బహుజన రాజ్యాన్ని స్థాపిద్దామని సామాజిక తత్వవేత్త, ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ భద్ర అన్నా రు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్క రూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాలుష్యరహిత సమాజాన్ని నిర్మిం చాలన్నారు. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ పర్యావరణవేత్త, బహుజన ఉద్యమకారుడు, ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ కార్యవర్గ సభ్యుడు బి.ఎస్.పి పార్టీ తెలంగాణ రాష్ట్రం సెంట్రల్ కో-ఆర్డినేటర్‌గా నియమితులైన ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ సభ్యులు దాగిల్ల దయానందరావును శాలువాలు ప్రశంస పత్రాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకాలను నిషేధించాలన్నారు. పర్యావరణ సమస్యను అన్ని పార్టీలు తమ ఎజెం డాలో పెట్టాలన్నారు. ప్రపంచ పర్యావరణ సంస్థ సలహాదారు గ్రాండ్ మాస్టర్ గల్లా ప్రకాష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో బహుజనవాదం ఒక అగ్నిపర్వతంలాగా బద్దలు కొడుతూ ముందుకు సాగుతుందన్నారు.
బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సెంట్ర ల్ కో-ఆర్డినేటర్‌గా నియమితులైన దయానందరావు మాట్లాడుతూ మహనీయుడు కాన్సిరాం, మాయావతి స్ఫూర్తితో బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలను ఆశయాల ను ముందు తీసుకెళ్లడానికే పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ వేత్తలు నిఖిల్ రిజ్వాన్ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు లక్ష్మీనారాయణ, రాజేష్, ప్రశాంత్ పాల్గొన్నారు.