24-03-2025 01:43:25 AM
సూర్యాపేట, మార్చి 23: కులమత, దోపిడి లేని నవ సమాజాన్ని నిర్మించుకునేందుకు యూవత సంసిద్ధం కావాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ ల 94 వ వర్ధంతిని పురస్కరించుకుని ఆ పార్టీల ఆధ్వర్యంలో విప్లవ వీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా కమిటీ సభ్యులు వేర్పుల లక్ష్మయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, పివైఎల్ జిల్లా నాయకులు పరుశురాం, పిడిఎస్యు జిల్లా నాయకులు విజయ్, పార్టి డివిజన్ నాయకులు ఎస్కే సయ్యద్, చిత్తలూరు లింగయ్య, పట్టణ కార్యదర్శి గులాం హుస్సేన్, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, వీరబాబు, నవీన్ రెడ్డి, సత్తి రెడ్డి, సుధాకర్, రమేష్, పద్మ, కల్పన, లక్ష్మి , గౌరమ్మ పాల్గొన్నారు.