- క్షణికమైన సంతోషం కోసం డ్రగ్స్ బారిన పడకండి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్క రూ భాగస్వామలు కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరం సందర్భం గా రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు శూభాకాంక్షలు తెలిపారు.
పాత వ్యవసనాలను విడిచిపెట్టి నూత న ఆశయాలు, లక్ష్యాలతో నూతన సంవత్సరంలోని అడుగుపెట్టాలని, అప్పుడే జీవితం లో వెలుగులు విరజిమ్ముతాయని వెల్లడించా రు. క్షణికమైన సంతోషం కోసం డ్రగ్స్ బారిన పడి అర్థవంతమైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దని సూచించారు. దుర్మార్గమైన డ్రగ్స్‌ను ధ్వంసం చేద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.
మద్యం తాగి వాహనాలు నడపడం, వేగం గా వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అంద రం ప్రతిన భూనుదామని సూచించారు.