calender_icon.png 16 April, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాచక రహిత సమాజాన్ని నిర్మిద్దాం

16-04-2025 12:28:52 AM

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) మానవత్వ విలువలను సనాతన ధర్మా న్ని తెలియజేస్తూ యాచక రహిత సమాజ నిర్మాణంకు కృషి చేద్దామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో స్ఫూర్తి, విజేత విద్య సంస్థలకు చెందిన విద్యా వేత్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి యాచక రహిత సమాజం, మానవత్వ విలువలు, ధర్మ యుగం అనే అంశాలపై వారు చేస్తున్నా కృషిని వివరించారు.

ఈ సందర్బంగా ఆయా అంశాలపై ప్రజల్లో అవగా హన కల్పించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాఠాల్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్బంగా సమాజంలో తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తు న్నందుకు వారిని అభినందించారు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, పిల్లలకు దూరమైన తల్లిదండ్రులు తిండిలేక రోడ్లపైన అడుక్కుంటు న్నారని అలాంటి వారికి గురుకులాల ద్వారా విద్యను అందించేందుకు తాము కృషి చేస్తామని వారు కేంద్రమంత్రికి తెలిపారు.

అనేక మంది శారీరక, మానసిక వికలాంగులు కూడా ఉంటున్నారని.. వారికీ సరైన వసతులు కల్పించి అవసరమైన వారిని అనాథ ఆశ్రమాలలో చేర్పిస్తున్నట్లు చెప్పా రు. విద్యార్థి దశలో ఉన్న వారైతే  గురుకుల పాఠశాలలో, చిన్న పిల్లలైతే అనాథ శరణాలయాలలో చేర్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, స్థానిక ప్రజలు, వైద్య విద్యా సంస్థలు సహాయ సహకారాలతో చేస్తున్నామని పేర్కోన్నారు.

ఈ అంశాలతో కూడిన పాటను వందేమాతరం శ్రీనివాస్ కిషన్ రెడ్డికి వినిపించారు. ఈ అంశాలపై ఒక లఘు చిత్రాన్ని కూడా నిర్మించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్ఫూర్తి, విజేత విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణం రాజు, వందేమాతరం శ్రీనివాస్, ముదిగొండ విశ్వేశ్వర శాస్త్రి, సుధీర్ వర్మ, నటుడు నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.