calender_icon.png 23 February, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగలే చుక్కల్ తెచ్చి డిస్కోలే ఆడించేద్దామా..

19-02-2025 12:00:00 AM

సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న 30వ సినిమా ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియో స్‌ల కొలాబరేషన్‌లో రూపుదిద్దుకుంటోంది. రాజేశ్ దండా నిర్మాత కాగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్, అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి మేకర్స్ మంగళవారం ‘పగిలి’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను లియోన్ జేమ్స్ మాస్ డ్యాన్స్ నెంబర్‌గా కంపోజ్ చేశారు.

‘పలిగిపోయేటట్టు డీజేలే పెట్టించేద్దామా.. పగలే చుక్కల్ తెచ్చి డిస్కోలే ఆడించేద్దామా..’ అంటూ సాగుతున్న ఈ సాంగ్‌లో సందీప్‌కిషన్, రీతూవర్మ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. మహాలింగం, సాహి తీ చాగంటి ఆలపించిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్, ప్రసన్నకుమార్ బెజవాడ సాహిత్యం అందించా రు.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశా రు. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ; ఆర్ట్: బ్రహ్మ కడలి; స్టంట్స్: పృథ్వీ; కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్: రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ.