calender_icon.png 4 April, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలి

04-04-2025 01:35:29 AM

ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

పార్టీ ప్రతినిధి బృందానికి  అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపు

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ‘తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే నిలుస్తున్నారు. మన ప్రభుత్వం చేసే మేలును ప్రజలు ఎప్పటికీ మరువరు. అందుకే ప్రజా సంక్షేమమే మన పరమావధి కావాలి. 42శాతం రిజర్వేషన్లు సాధించి బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలి’ అని ఏఐసీసీ అ గ్ర నాయకురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్, అనిల్‌కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. 42 బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం గురించి ఆమెకు వివరించారు.  సందర్భంగా సోనియాగాంధీ వారికి కొన్ని అంశాలపై సూచనలు, సలహాలిచ్చారు. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చే వరకు తాము పార్లమెంట్‌లో కొట్లాడుతామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను స మర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 

42 బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడండి 

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని కాంగ్రెస్ ప్రతిని ధుల బృంద సభ్యులు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, మంత్రులు పొ న్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, రాజ్‌కుమార్, ఎంపీ మల్లు రవి గురువారం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పంపించిని రిజర్వేషన్ల బిల్లును కేంద్రంతో ఆమోదింపజేసేందుకు చొరవ చూపాలని కోరారు.