calender_icon.png 23 September, 2024 | 5:47 AM

యోగాతో యోధులవుదాం..

23-09-2024 01:05:37 AM

ప్రజారోగ్యంపై స్పెషల్ నజర్

యోగా నేర్పించేందుకు ట్రైనర్ల నియామకం

రాష్ట్రవ్యాప్తంగా 842 పార్ట్ టైం పోస్టుల భర్తీ 

రేవటి నుంచి ఇంటర్వ్యూలు  

మహిళా ఇన్‌స్ట్రక్టర్లకు వేతనంలో తేడా

హైదరాబాద్, సెప్టెంబర్ 2౨ (విజయక్రాంతి): వ్యాధి బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడానికంటే అవి రాకుండా ఎలాంటి ఆహారపు అలవాట్లు, యోగా, ఇతర పద్ధతు లు పాటించాలనే అంశంపై ఇప్పుడు అంతా దృష్టి సారిస్తున్నారు. శారీరక, మానసిక ఆరో గ్యం అంచించే యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. యోగా మూలాల న్నీ మన దేశంలో ఉన్నా..  ఐక్యరాజ్య సమితి ప్రపంచ యోగా డేను జరుపుతుండడంతో ఇప్పుడు విదేశాల్లో యోగాకు ఎంతో డిమాండ్ ఏర్పడింది.

యోగా వల్ల ప్రశాంత త, విశ్రాంతి, మానసిక ఆరోగ్యం మెరుగవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థు లకు జ్ఞాపకశక్తికి ఎంతో ఉపకరిస్తుంది.  ఈ నేపథ్యంలో  ప్రజలకు యోగాను అందించేందుకు  కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణ యించింది. ఈ తరుణంలో తెలంగాణప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా 842 యోగా ఇన్‌స్ట్రక్టర్లను పార్ట్‌టైం బేసిస్‌లో నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్రవ్యాప్తంగా 421 యోగా షెడ్లు..

రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యం లో 421 యోగా షెడ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ షెడ్లలో ఉదయం, సాయం త్రం యోగా నేర్పించేందుకు 421 మంది పురుషులు, 421 మంది మహిళా యోగా ఇన్‌స్ట్రక్టర్ల నియామకం కోసం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఆయుష్, వెల్‌నెస్ సెంటర్ల ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఉదయం గంట, సాయంత్రం గంట పాటు వీరు స్థానికులకు యోగా నేర్పిస్తారు. అన్ని ఉమ్మడి జిల్లాల పరిధిలో నియామక కమిటీలు యోగా ఇన్‌స్ట్రక్టర్లను ఎంపిక చేస్తా యి.

కమిటీలలో కన్వీనర్‌గా అడిషనల్ డైరెక్టర్(ఆయుష్/హోమియో/యునాని), సభ్యు లుగా రీజినల్ డిఫ్యూటీ డైరెక్టర్, మెడికల్ ఆఫీసర్ (నేచురోపతి) జిల్లా ఆయుష్ ఇన్‌ఛార్జి ఉంటారు. మంగళవారం 24 నుంచి 30వ తేదీ లోపు ఇంటర్వ్యూలు పూర్తి చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. యోగాలో కనీసం సర్టిఫికెట్ కోర్సు ఉన్న వారికి ఈ పోస్టులలో ప్రాధాన్యం ఇస్తారు. కేంద్రం యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నందున భవిష్యత్తులో ఈ పోస్టులు పర్మినెంట్ అవుతాయనే ఉద్దేశంతో చాలా మంది అభ్యర్థులు యోగా ఇన్‌స్ట్రక్టర్లుగా చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నా రు. అయితే ఈ పోస్టుల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యం ఉంటుందని అధికారులు తెలిపారు. 

వేతనంలో వ్యత్యాసం..

యోగా ఇన్‌స్ట్రక్టర్ల వేతనాల్లో వ్యత్యాసంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుష అభ్యర్థులకు రూ. 8వేలు, మహిళలకు రూ. 5వేలు వేతనంగా ఇవ్వనున్నట్లు ఆయుష్ అధికారులు ప్రకటించారు. దీనిపైనే మహిళా ఇన్‌స్ట్రక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో తాము ఏ విషయంలో తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆయుష్ అధికారులు, ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు..

తేదీ సమయం జిల్లా కన్వీనర్

అక్టోబర్ 24, 2024 ఉదయం10:30 ఆదిలాబాద్ ఏడీ, ఆయుర్వేద

అక్టోబర్ 24, 2024 ఉదయం10:30 హైదరాబాద్ ఏడీ, యునాని

అక్టోబర్ 25, 2024 ఉదయం10:30 నిజామాబాద్ ఏడీ, హోమియో

అక్టోబర్ 26, 2024 ఉదయం10:30 మెదక్ ఏడీ, యునాని

అక్టోబర్ 26, 2024 ఉదయం10:30 రంగారెడ్డి ఏడీ, హోమియో

అక్టోబర్ 27, 2024 ఉదయం10:30 నల్గొండ ఏడీ, హోమియో

అక్టోబర్ 28, 2024 ఉదయం10:30 కరీంనగర్ ఏడీ, ఆయుర్వేద

అక్టోబర్ 30, 2024 ఉదయం10:30 ఖమ్మం ఏడీ, యునాని

అక్టోబర్ 30, 2024 ఉదయం10:30 మహబూబ్‌నగర్ ఏడీ, ఆయుర్వేద

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి 

మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. యోగా ఇన్‌స్ట్రక్టరలో మహిళలకు రూ. 5వేలు ఇస్తూ పురుషులకు రూ. 8వేలు ఇవ్వడం అసమానతకు నిదర్శనం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి. మహిళలంటే చిన్నచూపు చూస్తున్నారని చెప్పేం దుకు ఇది ఓ నిదర్శనం. ఆయుష్ అధికారులు వెంటనే తమ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలి.  మహిళా ఇన్‌స్ట్రక్టర్లకు కూడా రూ. 8వేలు వేతనంగా ఇవ్వాలి. 

రాజేశ్వరి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర కాంట్రాక్టు, 

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం