14-04-2025 01:12:42 AM
- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ ఏప్రిల్ 13 (విజయ క్రాంతి) : అందరం ఐక్యంగా ఉండి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సంకల్పంతో ముందుకు సాగుదామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం పూలే - అంబేద్కర్ జాతర కమిటీ హాన్వాడ మండల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏప్రిల్ 26వ తేదీన నిర్వహించనున్న అంబేద్కర్ జాతర కరపత్రాన్ని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. పూలే అంబేద్కర్ జాతర కమిటీకి పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతర కమిటీ అధ్యక్షులు మునిమోక్షం రాజు కమిటీ పెద్దలు పెద్దెల్లి జంబులయ్య, కిందింటి కిరణ్, బాలయ్య, యాదయ్య, కాలే యాదయ్య, రాములు, రామచంద్రయ్య, ప్రవీణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.