calender_icon.png 23 September, 2024 | 4:02 AM

సింగరేణి భాగస్వామ్యాన్ని ఒప్పుకోం

23-09-2024 01:44:20 AM

తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రామగుండంలో నిర్మించ నున్న థర్మల్ పవర్ ప్లాంట్‌లో సింగరేణి భాగస్వామ్యాన్ని ఒప్పుకునేది లేద ని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్ అసోసియేషన్ -(టీజీపీఈఏ) నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం ఎర్ర గడ్డలోని జెన్‌కో ఆడిటోరియంలో టీజీపీఈఏ సర్వసభ్య సమావేశం జరిగింది. విద్యుత్ సంస్థల్లో జరగనున్న పురోగతి, సంస్థ మనుగడకు సంబంధించి పలు విషయాలపై చర్చించినట్లు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రత్నాకర్ రావు, సదానందం తెలిపారు.

టీజీ జెన్‌కో, సింగరేణి ఆధ్వర్యంలో జాయిం ట్ వెంచర్‌గా 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలి పారు. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థయిన టీజీజెన్‌కో ద్వారానే రామగుం డం థర్మల్ ప్లాంట్  నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు. విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులను వెంటనే నియమించాలని సీఎం, డిప్యూ టీ సీఎంలను కోరారు. విద్యుత్ సంస్థ ల్లో అసిస్టెంట్ ఇంజినీర్ రిక్రూట్‌మెంట్ జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలన్నారు.