calender_icon.png 16 April, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం

15-04-2025 12:00:00 AM

  1. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం
  2. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) ః బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగు జాడలలో నడు స్తూ ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించాలని భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

సోమవారం భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం దగ్గర  134వ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్,ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య , భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డి.సి.పి అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి వివిధ సంఘ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు.

అనంతరం జిల్లా ఎస్సీ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే  స్వాతంత్రం తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో దేశం ముందుకు పోతుందన్నారు.

కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి,జె ఏ సి చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, కులాల సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి వసంతకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి శ్యామ్ సుందర్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు, మున్సిపల్ కమిషనర్ రాజలింగం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ, పిసిసి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్, పిసిసి డెలిగేట్ నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ లు బర్రె జాంగిర్, మొత్తం శెట్టి వెంకటేశ్వర్లు, బట్టు రామచంద్రయ్య, వివిధ దళిత సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి  నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య తదితరుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, కిన్నెర అంజి, కంచర్ల ఆనంద్ రెడ్డి, రంజిత్ పాల్గొన్నారు.

డా.శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. 

తాజ్ పూర్ గ్రామంలోఅంబేద్కర్ జయం తి వేడుకల్ని గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సామాజికవేత్త, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు, డా,ర్యాకల శ్రీనివాస్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం పండ్లు, చేసారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీడీఓ శ్రీనివాస్ పంచాయితీ సెక్రటరీ వెంకటేష్ మాజీ సర్పం బొమ్మరపు సురేష్ పాల్గొన్నారు.

ఆశయాలను ఆచరణలో పెడితే.. మానవుడే మహనీయుడవుతాడు 

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు 

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), ఏప్రిల్14: మహనీయుల ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడవుతాడని తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేలు అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మండల కేంద్రం అర్వపల్లి లోని తహశీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం అర్వపల్లిలోని ప్రధాన చౌరస్తాలో జై బాపు-జై భీమ్-జై సంవిధాన్ మండల కో-ఆర్డినేటర్ జీడి వీరస్వామి అధ్యక్షతన జరిగిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిబాపూలే,బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి,వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న,తాహశీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీఓ గోపి, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇందుర్తి వెంకట్ రెడ్డి,గుడిపల్లి మధుకర్ రెడ్డి, కుంట్ల సురేందర్ రెడ్డి,బైరబోయిన సైదులు, మహారాజు, ఈదురు వీర పాపయ్య, మచ్చ నర్సయ్య,బందెల అర్వపల్లి,వివిధ శాఖల అధికారులు, పలు ప్రజా సంఘాల నాయకులు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పం లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సూర్యాపేటలో..

సూర్యాపేట, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) ః రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆయన సేవలను స్మరించుకొని అంబేడ్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. 

ఊరు.. వాడా..

పట్టణంతోపాటు మండల కేంద్రాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ అంబేడ్కర్ చిత్రపటానికి  నివాళి అర్పించారు.