అన్ని బంధాల్లోకి భార్యాభర్తల బంధం ప్రత్యేకమైనది. రెండు విభిన్న కుటుంబాల నుంచి వచ్చినవారు కలిసి జీవించడం అనేది ఎంతో కష్టం. కానీ భార్యాభర్తలు విభిన్న ప్రదేశాలు, పరిస్థితులు, పర్యావరణం నుంచి వచ్చి కూడా కలిసి జీవించేందుకు ప్రయత్నిస్తారు. పెళ్లి తర్వాత జీవితం ఆనందంగా ఉండాలంటే భార్య మనసును అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. మీ కోసం టేస్టీగా టీ పెట్టినా, యమ్మీగా బ్రేక్ ఫాస్ట్ వండినా కూడా ఆమెకు థాంక్స్ చెప్పండి.
అది కూడా ప్రేమగా చెప్పండి. అలా చెబితే ఆమె ఎంతో ఆనందిస్తుంది. చిన్న చిన్న ఆనందాలు జీవితానికి చాలా అవసరం. ఇవే భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పటిష్టంగా మారుస్తాయి. అలాగే ప్రతిరోజూ కనీసం గంటసేపైనా కలిసి మాట్లాడుకునేలా ప్లాన్ చేసుకోవాలి. వీలైతే భార్యతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఇద్దరి మధ్య బంధం పెరగటానికి ఇది చాలా అవసరం. ఇద్దరి మధ్య పరస్పరం ప్రేమ, గౌరవం అనేవి చాలా ముఖ్యం.