calender_icon.png 12 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక న్యాయం కోసం కలిసి పనిచేద్దాం

12-01-2025 12:11:09 AM

  1. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్
  2. విజయవంతమైన మీడియా పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

నాగర్ కర్నూల్ జనవరి 12 (విజయక్రాంతి) ః ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులతో పాటు నాలుగో స్తంభమైన మీడియా కూడా కలిసి పనిచేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన న్యాయం అందుతుందని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అభిప్రాయపడ్డారు.

శనివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా- పోలీసు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యి క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. పోలీస్ టీం కెప్టెన్ గా తాను కూడా భాగస్వామ్యం అయ్యారు. మొదట టాస్ గెలిచిన మీడియా ఫీల్డింగ్ ఎంచుకొని బరిలోకి దిగగా పోలీస్ టీం 12 ఓవర్లలో 147 అత్యధిక పరుగులు సాధించిగా 148 టార్గెట్ తో బరిలోకి దిగిన మీడియా టీం 89/9 పరుగులు సాధించింది.

ఇందులో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ 69 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్గా బహుమతిని అందుకన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ పోలీసులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థ ప్రజా అవసరాల కోసం పనిచేస్తుందన్నారు.

ఈనెల 21 నుండి మూడు రోజులపాటు జడ్పీ మైదానంలో పోలీస్ స్పోరట్స్ మీట్ ఉంటుందన్నారు. మీడియా,  రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల వారిగా క్రికెట్ పోటీలను తరచు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  సిఐలు విష్ణువర్ధన్ రెడ్డి, నాగార్జునతో పాటు సీనియర్ జర్నలిస్టులు సిబ్బంది ఉన్నారు.