calender_icon.png 14 February, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం

02-05-2024 01:51:22 AM

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల యూత్ కాంగ్రెస్ తీర్మానం  

యూత్ కాంగ్రెస్ నాయకులు కష్టపడి పని చేయాలి 

భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం:  తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, మే1 (విజయక్రాంతి): నల్లగొండ, ఖమ్మం, వరంగల్  పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని యూత్  కాంగ్రెస్ తీర్మానం చేసింది. అందు కు తగ్గట్టుగా యూత్ కాంగ్రెస్ శ్రేణులంతా మల్లన్న గెలుపు కోసం కష్టపడి పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. బుధవా రం గాంధీభవన్‌లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్  జిల్లాలకు చెందిన యూత్ కాంగ్రె స్ నాయకులు, కార్యకర్తల సమవేశం జరిగిం ది. ఈ సమావేశానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యారు. అనంతరం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ..  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలా లు అందుతున్నాయని, 30 వేల ఉద్యోగాల ను భర్తీ చేసిన అంశాన్ని ప్రతి ఓటర్‌కు వివరించాలన్నారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధి లోని మూడు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, గెలుపు కోసం పార్టీ శ్రేణుల సహకారం తీసుకోవాలన్నారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తన ప్రచారానికి యువత నుంచి మంచి స్పందన ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందామని, ఇప్పుడు భారీ మెజార్టీతో విజయం సాధిం చి శాసనమండలిలో అడుగు పెట్టేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు.