రైతు భరోసాను ఆపింది బీఆర్‌ఎస్‌దే పార్టీనే
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
వనపర్తి (గద్వాల), మే 11 (విజయకాంత్రి): విభజన హామీలు మరిచిన బీజేపీని బొందపెట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. శనివారం జోగుళాంబగద్వాల జిల్లా కేంద్రంతోపాటు, వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, సినీ నిర్మాత బండ్ల గణేశ్, జడ్పీ చైర్‌పర్సన్ సరితతో కలిసి ఎంపీ అభ్యర్థి మల్లు రవి తరఫున ప్రచారం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతూ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించడానికి 400 సీట్లు అడుగుతుందని అలాంటి పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చూసే బాధ్యత నడిగడ్డ ప్రజలదని అన్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీగా మల్లు రవిని గెలిపించాలని కోరారు. దేశ వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్న సీపీఎం నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. గడిచిన పదేళ్లుగా ప్రజలను బానిసలుగా చేసి పరిపాలనను కొనసాగించారని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు.