calender_icon.png 1 November, 2024 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంశీకృష్ణను గెలిపించుకుందాం

16-04-2024 04:20:46 PM

n మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. పెద్దపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే విజయరమణా రావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వంశీకృష్ణ  గెలుపునకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కష్టపడి పని చేయాలని దిశానిర్ధేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. మానేరు వాగు నుంచి ఇసుక తరలించనివ్వం అని చెప్పారు. రైతుల పంటను చివరి గింజ వరకూ ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి, జూలపల్లి జెడ్పీటీసీలు బండారి రామ్మూర్తి, బొద్దుల లక్ష్మణ్, పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ పీఏసీఎస్ చైర్మన్లు మాదిరెడ్డి నరసింహారెడ్డి, చదువు రామ్‌చంద్రారెడ్డి తదితరులకు మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.