భారత 11వ రాష్ట్రపతిగా విశిష్ట సేవలందించి ‘ప్రజా ప్రసిడెంట్’గా ప్రజల గుండె ల్లో చెరగని ముద్ర వేసిన ఏపీజే అబ్దుల్ కలాం 15 అక్టోబర్ 1931న ప్రముఖ దక్షిణ భారత తీర్థ స్థలమైన రామేశ్వరం పట్టణంలోని పేద తమిళ ముస్లిమ్ కుటుంబంలో ఆశియమ్మ - జైనులబ్దీన్ దంపతులకు జన్మించారు. రామేశ్వరంలో పాఠశాల విద్య, తిరుచురాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజీలో భౌతిక శాస్త్రం (1954), మద్రాస్ యంఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ (1960) పట్టాలు పొందారు. అతి సాధారణ విద్యార్థి దశ నుంచి అసాధారణ మేధావిగా కలాం ఎదిగిన క్రమం విలక్షణం, ఆశ్చర్యకరం, సదా అనుసరణీయం.
పడవలు నడిపే వృత్తిలో పేరు గాంచిన కలాం కుటుంబం, వ్యాపారంలో నష్టం రావడంతో కష్టాల కడలిలో ఎదురీదుతూ, పట్టుదలతో చదువుల ను కొనసాగిస్తూ, పేపర్ బాయ్‌గా పని చేస్తూ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేయగలగడం నేటి యు వతకు ప్రేరణాత్మకం. జననం సాధారణమే కావచ్చు, మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలని కలాం జీవితం చెప్పకనే చెబుతున్నది.
శాస్త్రవేత్త నుంచి స్ఫూర్తి ప్రదాత వరకు!
నాలుగు దశాబ్దాల ఉద్యోగ పర్వంలో ఏరోస్పేస్ సైంటిస్ట్‌గా, సైన్స్ అడ్మినిస్ట్రేటర్‌గా విలక్షణ సేవలందించే క్రమంలో డీఆర్డీఓ (డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్) సంస్థల్లో పరిపాలనాదక్షుడిగా, మిలటరీ మిసైల్ రూపశిల్పిగా తన సత్తా చాటి, ‘భారత క్షిపణి పితామహుడు’ (మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇం డియా)గా కీర్తిని పొందారు. ప్రధాని ముఖ్య వైజ్ఞానికశాస్త్ర సలహాదారుగా, డీఆర్డీఓ సెక్రటరీగా 1992 నుంచి 1999 వరకు పని చేశారు. స్వావలంబన దిశగా భారతదేశాన్ని న్యూక్లియర్ ఎనర్జీ కలిగిన దేశంగా నిలపటానికి 1998లో పోఖ్రాన్- పరీక్షలను పర్యవేక్షించి ప్రజలతో జేజేలు అందుకున్నారు.
భారత వాయుసేనలో ఫైటర్ పాయిలెట్గా పని చేయాలనుకున్న కలాం ఏరోస్పేస్ శాస్త్రజ్ఞుడిగా ఎవరికీ అందనం త ఎత్తుకు ఎదిగారు. ఉద్యోగిగా తన సీనియర్స్ డా॥ విక్ర మ్ సారాభాయ్, ఆచార్య సతీష్ ధావన్, డా॥ బ్రహ్మ ప్రకాశ్ లాంటి దిగ్గజాలవద్ద నాయకత్వ పటిమను, అంతరిక్ష శాస్త్ర సాంకేతిక మెళకువలను నేర్చుకు న్నారు. 1969లో ఇస్రోకు బదిలీ అయిన కలాం నేతృత్వంలో భారత తొలి ‘సాట్లుటై లాంచింగ్ వెహకిల్’ (యస్ఎల్వీ3) ను రూపొందించడంలో విజయం సాధించారు.
1970 మధ్య పీయస్ఎల్వీ (పోలార్ సాట్లుటై లాంచింగ్ వెహకిల్), యస్ ఎల్వీ3 లను అభివృద్ధి పరచడంలో ప్రధాన భూమికను నిర్వహించారు. బాలిస్టిక్ మెసైల్ టెక్నాలజీతో ‘ప్రాజెక్ట్ డెవిల్’, ‘ప్రాజెక్ట్ వాలియంట్’లను రూపొందించడం లో మార్గదర్శనం చేశారు. ఇంటెగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఐజీయండీపీ) ద్వారా కలాం చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా 3.88 బిలియన్ పెట్టుబడితో పరిశోధనలు కొనసాగించారు. ‘అగ్ని’, ‘పృథ్వి’ మిసైల్స్‌ను విజయవంతంగా నిర్మించగలిగారు.
ఇంజినీర్, సైంటిస్ట్, రచయిత, ఆచార్యులు, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్తగా బహుముఖీన ప్రతిభ కలిగిన అబ్దుల్ కలాం బోధనలు అజరామరం. ‘నేను చేయగలననే దృఢ సంకల్పమే విజయాలను అందిస్తుందని, ఎవరి తలరాతను వారే లిఖించుకోవాలని, నిజాయితీగల హృదయంతోనే వ్యక్తిత్వం వ్యక్తం అవుతుందని’ యువతరానికి మార్గనిర్దేశం చేశారు. ‘ఉన్నత కలలు కనండి. వాటి సాకారానికి కఠోర సాధన చేయండి’ అని వారికి పిలుపునిచ్చారు.
అద్భుత కృషి, అమూల్య సేవలు
కలాం జీవితం తెరిచిన పుస్తకం. సమస్త మానవాళికి మార్గదర్శకం. టెక్నాలజీ సహాయంతో ఆర్థిక, వ్యవసాయ, ఆరోగ్య, విద్యారంగాలను పరిపుష్ఠం చేయవచ్చని గట్టిగా నమ్మిన కలాం ముందుచూపు అద్వితీయం. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన కలాం ‘లీడ్ ఇండియా- ఉద్యమాన్ని ప్రారంభించి, ఐదేళ్ళలో 5 లక్షలమంది యువతకు మార్గ దర్శకం చేయాలనే లక్ష్యాన్ని సాధించడానికి అసాధారణ కృషి సలిపారు. భారత అత్యుత్తమ పౌర పుర స్కారం ‘భారత రత్న’ ఆవార్డు పొందిన ఏకైక తొలి సైంటిస్ట్, బ్రహ్మచారి కలాం అనంతరం రాష్ట్రపతిగా విశిష్ట సేవలు అందించారు.
అనేక అగ్ర విద్యాసంస్థలు ఐఐయం, ఐఐయస్సీ, ఐఐఐటీ, బిహెచ్‌యు, అన్నా విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ఫ్రొఫెసర్‌గా అమూల్య సేవలు, అనుభవ సారాలతోకూడిన బోధనలను అం దించారు. జీవితకాలంలో 40కి పైగా విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకోగలిగారు. తన అనుభవాలను, ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్దేశ్యంతో ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’, ‘ఇండియా ‘ఇగ్నైటెడ్ మైండ్స్’, ‘ఇండామి టబు ల్ స్పిరిట్’ వంటి పలు పుస్తకాలు రచించారు.
26 జూలై 2015న ఐఐయం, షిల్లాంగ్‌లో విద్యార్థులతో ముచ్చటిస్తూనే 83వ ఏట తుదిశ్వాస విడి చారు. బలమైన విజయకాంక్షతోనే అపజయాలను అధిగమించాలని, విద్య అనే రెక్కలతోనే సగర్వంగా ఎదగాలంటూ నినదించిన కలాం దార్శనికత పరమ పవిత్రం, యువతర ప్రగతికి ఇంధనం. ‘సక్సెస్ అంటే మన సంతకం ఆటోగ్రాఫ్‌గా మారాడమే’ అన్న కలాం, ‘కల అంటే నిద్రలో వచ్చేది కాదని, నిద్ర రానివ్వకుం డా చేసేదని’ అద్భుత నిర్వచనం ఇచ్చారు. వారి జీవి తం ఆసాంతం అనుసరణీయం, సదా స్మరణీయం.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి