నిర్మల్ (విజయక్రాంతి): దేశంలో హిందూ సమాజాన్ని జాగ్రత్త చేసి హైందవ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు కృషి చేయాలని ఆర్ఎస్ఎస్ ప్రముఖ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పదని నేటి యువత సాంస్కృతి పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు. యువకులు దేశభక్తి జాతీయ భవం పెంపొందించుకున్నప్పుడే దేశం అన్ని రంగాల్లో ప్రేమించబడుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ప్రముఖ వైద్యులు డాక్టర్ రామచంద్ర రెడ్డి నిర్వాహకులు నూకల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.