24-03-2025 01:37:25 AM
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి మార్చి 23 ( విజయ కాంతి ): జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాలతో ప్రజల్లో మమేకమవుదామని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన యాదగిరిగుట్టలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర పిసిసి కోఆర్డినేటర్, జై బాపు జై భీమ్ కార్యక్రమాల ఆలేరు, బోనగిరి నియోజకవర్గాల ఇంచార్జ్ సంధ్యారెడ్డి లతో కలిసి ఎంపీ పాల్గొని ప్రసంగించారు.
గత పది సంవత్సరాలుగా దేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందని అన్నారు. బిజెపి రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య పాలన సాగిస్తుం దని ఆరోపించారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు సమన్యాయం కల్పించాల్సిన పాలకులు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాలువస్తు బిజెపి పాలకులు ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు.
కోఆర్డినేటర్ సంధ్యారెడ్డి మాట్లాడుతూ జై బాపు జై భీమ్ సమ్ విధానం నినాదాలతో ప్రతి గ్రామంలోకి వెళ్లి ప్రజల్లో మమేకం కావాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి, కోఆర్డినేటర్ సంధ్యారెడ్డిని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి లను ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి పిట్టల బాలరాజు, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, భరత్ గౌడ్ కానుగు బాలరాజు, యాదగిరి, నరసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి సుబ్బూరు శ్రీనివాస్, సామల రవీందర్, దాకురి ప్రకాష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సప్పిడి శిరీష, అంకం రాజేష్, రాజశేఖర్, రాజు, సురేందర్, రాజు గౌడ్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు