calender_icon.png 26 November, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురం భీం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుందాం..

22-10-2024 01:45:44 PM

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): అందరికీ సమానమైన న్యాయం జరగాలని సదుద్దేశంతో పోరాటం చేసిన ఘనత కొమురం భీంకు దక్కుతుందని బిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి బి. దాస్ అన్నారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర కొమరం భీమ్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహుజన స్టూడెంటు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి బి. దాస్ మాట్లాడుతూ.. కొమరం భీమ్ యువతకు స్ఫూర్తి అని జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజనుల పోడు భూముల హక్కుల కోసం పోరాటం కొనసాగించారని తెలిపారు. అప్పటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంచేసి మా గూడెంలో మా రాజ్యం అంటు అటవీ భూముల మీద పూర్తి అధికారం గిరిజనులకు ఉండాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. అప్పటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం చేసిన ఘనత కొమరం భీమ్ కు దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షుడు సురేందర్, చైతన్య, వినయ్, అశోక్, రామకృష్ణ, వెంకట్, రమేష్ పాల్గొన్నారు.