12-04-2025 12:23:54 AM
ఎమ్మెల్యే మందుల సామెల్
తుంగతుర్తి, ఏప్రిల్ 11: సమాజంలో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలతో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిబా ఫూలే కొత్తదారి చూపారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ పేర్కొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు ఘనంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అన్నారు.
మహాత్మ జ్యోతిబాపూలే ఈ గడ్డపై పుట్టడం మన అదృష్టం
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 11 ( విజయ క్రాంతి ): మహనీయులైన మహాత్మా జ్యోతిబాపూలే ఈ గడ్డపై పుట్టడం మన అందరి అదృష్టం అని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని జగదేవ్ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతి బా పూలే 199వ జయంతి సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి వివిధ సంఘ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు.
అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు మాట్లాడుతూ దేశంలో ఎన్నో మార్పుల కోసం మహాత్మ జ్యోతిబాపూలే కారణమని అన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఈరోజు మహాత్మా జ్యోతిబాపూలే మహనీయుల జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఎంతో సంతోషం అని అన్నారు.
ఏప్రిల్ మాసం మొత్తం మహనీయుల జయంతి ఉత్సవాలు ఉన్నందున్న ఒక పండుగ వాతావరణంలో నిర్వహించు కుంటున్నామని, సమ సమాజానికి నిర్మాణం చేయాలని, అట్టడుగున వర్గాల వారిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
భువనగిరి ఆర్డిఓ కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా బాబురావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి యాదయ్య, మున్సిపల్ కమిషనర్ రాజలింగం,మాజీ మున్సిపల్ చైర్మన్ , వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి వేడుకల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, పాల్గొని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిం చారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించు కెసిఆర్ బహిరంగ సభ వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో యా దాద్రి భువనగిరి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు గారు వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య గారు బిఆర్‌ఎస్ పార్టీ భువనగిరి పట్టణ మరియు మండల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ జనగాం పాండు బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ మరియు మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు.
రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నీల ఓం ప్రకాష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి బీరు మల్లయ్య గారు నాయకులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, ఇట్టబోయిన గోపాల్, ఎడ్ల సత్తిరెడ్డి, అబ్బ గాని వెంకటేష్, కస్తూరి పండు, కడారి వినోద్, తుమ్మల పాండు, కుశంగల రాజు, ఎన్నబోయిన జాంగిర్, తాడూరు బిక్షపతి, వెల్దుర్తి రఘునందన్, రాకల శ్రీనివాస్,కంచి మల్లయ్య, సుభాష్, సురేష్, శివకుమార్, నాగు, నితీష్, సూరజ్ సైదులు ,సతీష్ గౌడ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
పూలే ఆశయసాధనకు కృషి చేయాలి మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : మహాత్మాజ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్తో కలిసి పట్టణంలోని జ్యోతిబా పూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గొప్ప సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త, రచయిత పూలే అని కొనియాడారు.
మహిళలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. పూలే అనుచరులు, అట్టడుగు కులాల హక్కుల సాధనకు సత్యశోధక్ సమాజ్ను స్థాపించారని గుర్తు చేశారు. పూలే కలలు కన్న సమాజం నిర్మాణానికి ఐఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.
విద్యతోనే ప్రాధాన్యత లభిస్తుందని గుర్తించిన వ్యక్తి పూలే
సూర్యాపేట, ఏప్రిల్11 (విజయక్రాంతి): సమాజంలో విద్యకి చాలా ప్రాధాన్యత లభి స్తుందని జ్యోతిబా పూలే గుర్తించారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సమా జంలో విద్య వలన ప్రాధాన్యత, గుర్తింపు లబిస్తుందని గుర్తించిన మొదటి వ్యక్తి పూలే అని , ఆనాటి కాలంలో అస్ప్పశ్యత, లింగ వివక్షత ఉండేదని వాటిని నిర్ములించేందుకు, వితంతువులకి పునర్విహం చేసేందుకు జ్యోతిబా పూలే ఎంతగానో కృషి చేసారని అన్నారు.
అనంతరం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనం నిర్ములించేందుకు, మహి ళల విద్య , విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, అట్టడుగు వర్గాల ప్రజలను ఉన్నత స్థానానికి చేర్చేందుకు జ్యోతిబా పూలే ఎంతగానో కృషి చేసారని, జ్యోతిబా పూలే ఆశయాలు సాధించిన రోజునే మనం వారికి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని తెలిపారు. అన్ని రంగాలలో 42 శాతం అమలు చేసేందుకు అసెంబ్లీ లో చట్టం చేసి పార్లమెంట్ కి పంపటం జరిగిందని తెలిపారు.